News August 6, 2025

ఇవాళ క్యాబినెట్ సమావేశం

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉ.11 గంటలకు జరిగే ఈ సమావేశంలో నాలా చట్టం రద్దు బిల్లు, కొత్త బార్ పాలసీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే P-4 కార్యక్రమం, చేనేతలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Similar News

News August 7, 2025

శుభ సమయం (07-08-2025) గురువారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి మ.1.27 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాఢ మ.2.06 వరకు
✒ శుభ సమయం: ఉ.11.26-మ.12.02
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: రా.10.26-రా.12.05
✒ అమృత ఘడియలు: ఉ.9.00-ఉ.10.40

News August 7, 2025

HEADLINES

image

* భారత్‌పై మరో 25శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్
* ట్రంప్ సుంకాలు అన్యాయం, అసమంజసమన్న భారత్
* ట్రంప్ టారిఫ్స్ మోదీ వైఫల్యమని కాంగ్రెస్ విమర్శ
* ఈనెల 31న చైనాకు ప్రధాని మోదీ
* సెలూన్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: ఏపీ క్యాబినెట్
* లిక్కర్ కేసులో దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు: CM చంద్రబాబు
* రాహుల్‌ను PMని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం: CM రేవంత్ రెడ్డి

News August 7, 2025

బాలకృష్ణ ఏడాదికి 4 చిత్రాలు చేస్తానన్నారు: నిర్మాత

image

హీరో బాలయ్య ఏడాదికి 4 సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు నిర్మాత ప్రసన్నకుమార్ వెల్లడించారు. సినీ కార్మికుల వేతనాల పంచాయితీపై కొందరు నిర్మాతలు బాలకృష్ణను కలిసిన విషయం తెలిసిందే. ‘నిర్మాతలు, కార్మికులు ఇద్దరూ బాగుండేలా చూసుకుంటానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. వర్కింగ్ డేస్ తక్కువుంటే మంచిదన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని సూచించారు’ అని నిర్మాత తెలిపారు.