News August 4, 2024

రేవంత్ US పర్యటన తర్వాత క్యాబినెట్ విస్తరణ?

image

TG: CM రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేవంత్ రాష్ట్రానికి చేరుకుని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి AICC అగ్రనేతలతో చర్చించనున్నట్లు టాక్. క్యాబినెట్‌లో 6 ఖాళీలుండగా, ప్రస్తుతానికి నలుగురిని తీసుకోనున్నట్లు సమాచారం. మిగతా 2 బెర్తులను వివిధ సమీకరణాల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ తర్వాత PCC చీఫ్‌ను కూడా నియమిస్తారట.

Similar News

News December 8, 2025

శరీరంలోని ఈ భాగానికి రక్తం అవసరం లేదు!

image

మానవ శరీరంలో రక్త ప్రసరణ జరగని ఓ భాగం ఉందనే విషయం మీకు తెలుసా? కంటిలోని కార్నియాకు రక్తప్రసరణ జరగదు. ఇది తన అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను రక్తం ద్వారా కాకుండా నేరుగా వాతావరణంలోని గాలి నుండే గ్రహిస్తుంది. కార్నియాకు రక్తనాళాలు లేకపోవడం వల్లే అది పూర్తి పారదర్శకంగా ఉండి కాంతిని అడ్డుకోకుండా స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అలాగే జుట్టు, గోర్లకు కూడా రక్త ప్రసరణ జరగదు. కానీ ఇవి నిర్జీవ కణాలు.

News December 8, 2025

చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ నిరంతర ప్రక్రియ అని, అందరి సహకారంతో లక్ష్యాలన్నిటినీ సాధించగలమన్న నమ్మకం ఉందని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్‌లో TGని అభివృద్ధి చేస్తామని సమ్మిట్‌లో చెప్పారు. చైనా సహా జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా నుంచి ప్రేరణ పొందామని, వాటితో పోటీపడతామని వివరించారు. విజన్ కష్టంగా ఉన్నా సాధించే విషయంలో నిన్నటికంటే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

News December 8, 2025

పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

image

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.