News August 12, 2025
ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కెప్టెన్ గిల్

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రాణించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారు. జులైలో అద్భుత ప్రదర్శనకు గానూ ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు ఐసీసీ తెలిపింది. ఈ అవార్డుకు దక్షిణాఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ నిలిచారు.
Similar News
News March 11, 2026
టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.
News March 11, 2026
NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.
News March 11, 2026
ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.


