News March 31, 2024
‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’.. చంద్రబాబు స్కీమ్: కేశినేని నాని

AP: శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. ఆయనకు పేదలంటే చులకన అని, పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనేది ఆయన స్కీమ్ అని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.
Similar News
News February 16, 2026
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.
News February 16, 2026
మిల్క్ బ్యాంక్ గురించి తెలుసా?

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుండి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతర మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాల కు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.
News February 16, 2026
తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..

తల్లిపాలు దానం చేయాలంటే ముందుగా ఆ మహిళకు ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించాలి. తన బిడ్డకు సంతృప్తికరంగా పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు కలిగి ఉంటే వాటిని దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు తల్లి పాలను దానం చేయడానికి అనర్హులు. HIV, HTLV, హెపటైటిస్ B/ C/ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు.


