News September 12, 2025

CAT-2025: దరఖాస్తుకు ఒక్కరోజే ఛాన్స్

image

మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT)-2025 దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ. డిగ్రీ పాసైన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న రిలీజ్ చేస్తారు. NOV 30న పరీక్ష, 2026, JAN మొదటి వారంలో ఫలితాలు విడుదలవుతాయి. క్యాట్ స్కోరు ఆధారంగా IIM, IIT, NITల్లో MBA, పీహెచ్‌డీ, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.
వెబ్‌సైట్: <>https://iimcat.ac.in/<<>>

Similar News

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.

News December 16, 2025

NIPERలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్ (NIPER) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. BE, బీటెక్, B.COM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://niperahmnt.samarth.edu.in