News February 17, 2025

విజయవాడలో నేడు క్యాట్ బెంచ్ ప్రారంభం

image

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సర్క్యూట్ బెంచ్ నేడు విజయవాడలో ప్రారంభం కానుంది. క్యాట్ ఛైర్మన్ జస్టిస్ రంజిత్ వీ మోరే వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఏపీలో ఇప్పటివరకు సర్క్యూట్ బెంచ్ లేకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసు అంశాల్లో ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ లేదా HYD క్యాట్‌ను ఆశ్రయిస్తూ వచ్చారు. ఇకపై వారి కష్టాలు తీరనున్నాయి.

Similar News

News April 14, 2026

గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు.. రేపే ప్రారంభం

image

AP: ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అన్న క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేపు పల్నాడు(D) ధరణికోటలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పేదలతో భోజనం చేస్తారు. కాగా పట్టణాల్లోని 207 క్యాంటీన్లలో ప్రభుత్వం రూ.5కే ఫుడ్ అందిస్తోంది. రోజుకు సగటున 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారు.

News April 14, 2026

ఇవాళ సెలవు

image

రాజ్యాంగ నిర్మాత Dr.BR అంబేడ్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇవాళ సెలవు ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు, కోర్టులు, పోస్టాఫీస్‌లకు వర్తించనుంది. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. తమిళనాడు, అస్సాం నూతన సంవత్సరాలు, సిక్కుల అతిపెద్ద పండుగ బైసాఖీ, మహా విశ్వసంక్రాంతి పండుగలు కూడా నేడు జరుపుకుంటున్నారు. మీకూ సెలవు ఉందా?

News April 14, 2026

‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే డిజిటల్ రైట్స్‌ కోసం పెద్ద డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రైట్స్‌కు రూ.250 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.