Andhra Pradesh

News June 9, 2024

గిద్దలూరులో భారీ మెజార్టీ నుంచి ఓటమి

image

గత ఎన్నికల్లో YCP గిద్దలూరు నియోజకవర్గంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి సైకిల్ జోరందుకుంది. 2019 ఎన్నికల్లో గిద్దలూరు YCP ఎమ్మెల్యే అన్నా రాంబాబు TDP MLA అభ్యర్థి అశోక్ రెడ్డిపై 81,035 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి తలక్రిందులైంది. TDP అభ్యర్థి అశోక్ రెడ్డి నాగార్జునరెడ్డిపై 973 ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఓటమికి గల కారణాలు ఏంటా అని ప్రశ్నించుకుంటున్నారు.

News June 9, 2024

శ్రీకాకుళంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో 27,041 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 19,827(73.32%) ఓట్లు కూటమికి పడ్డాయి. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. వైసీపీకి 6,033(22.31%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి కేవలం 448(1.66%) మంది మాత్రమే ఓటు వేశారు.

News June 9, 2024

తూ.గో.: బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పీకే రావు రాజీనామా

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా, పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటకు చెందిన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పేరి కామేశ్వరరావు (పీకే రావు) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కార్పొరేషన్ సెక్రటరీకి పంపినట్లు తెలిపారు.

News June 9, 2024

కావలిలో విషాదం.. రైలు కింద పడి యువకుడి మృతి

image

కావలి పట్టణంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఉదయగిరి వంతెన సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.మృతుడు స్కై బ్లూ కలర్ హాఫ్ హాండ్ టీ షర్ట్ , బులుగు లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని కోరారు.

News June 9, 2024

జగన్ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది: టీడీపీ

image

మాజీ సీఎం జగన్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ అన్నారు. శనివారం అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో అరాచకాలు విధ్వంసాలు కక్ష సాధింపులకు తెగపడి ఆస్తులు నష్ట పరిచారని విమర్శించారు. జగన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం సరికాదన్నారు.

News June 9, 2024

కడప: రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు

image

ఎన్నికల సమయంలో కడప ఎక్సైజ్ డివిజన్ పరిధిలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప డివిజన్ పరిధిలో 40 ప్రభుత్వ దుకాణాలు, 14 బార్లు ఉన్నాయి. వాటి నిర్వాహకులు మేలో ఎక్సైజ్ డిపో నుంచి రూ.34.56 కోట్ల విలువ చేసే మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించారని ఎక్సైజ్ డిపో మేనేజర్ ధనుంజయకుమార్ తెలిపారు.

News June 9, 2024

కర్నూలు: డిగ్రీలో ముగ్గురు విద్యార్థుల డీబార్

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు మాస్ కాఫీయింగ్‌కు పాల్పడుతూ డీబార్ అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 87 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

News June 9, 2024

కర్నూలు: WOW.. బియ్యపు గింజలపై మోదీ, బాబు, పవన్ చిత్రాలు

image

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిత్రాలను బియ్యపు గింజలపై పెయింటింగ్ వేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

News June 9, 2024

అనంత జిల్లాలో 116 మంది అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు

image

అనంత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మినహా ఇతర అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇందులో జాతీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన 134 మంది అభ్యర్థుల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు 18 మంది పోగా మిగిలిన 116 మంది అభ్యర్థులు డిపాజిట్ దక్కించుకునేందుకు సరిపడా ఓట్లను సాధించలేక పోయారు.

News June 9, 2024

తొలిసారి ఎన్నికై.. కేంద్ర మంత్రిగా పెమ్మసాని.?

image

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితా లో స్థానం దక్కినట్లు సమాచారం. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకోవడం గ్రేట్ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.