Andhra Pradesh

News June 9, 2024

ప్రజలు మార్పు కోరుకున్నారు: చెవిరెడ్డి

image

గత 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎలాంటి అల్లర్లు జరగలేదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. ‘అభివృద్ధిలో దేశానికి చంద్రగిరి ఆదర్శంగా నిలవడానికి రూ.950 కోట్లతో పనులు చేశా. 1600 KM పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నా. కానీ మార్పు కోరి TDPకి అవకాశం ఇచ్చారు. వారి తీర్పును గౌరవిస్తున్నా. నాకు లక్ష ఓట్లు వేశారు. వాళ్లు అందరికీ పాదాభివందనం’ అన్నారు.

News June 9, 2024

నూజివీడు నియోజకవర్గంలో NOTAకు భారీగా ఓట్లు

image

నూజివీడు నియోజకవర్గంలో నోటా ( NOTA – None of the above)కు భారీగా 2,771 ఓట్లు పడ్డాయి. నూజివీడు లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మరీదు కృష్ణ సాధించిన ఓట్ల (2405) కంటే నోటా సాధించిన ఓట్లే అత్యధికం. కాగా నూజివీడులో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై 12,378 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News June 9, 2024

టి.నరసాపురంలో యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

image

యువకుడు అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు టి.నరసాపురం ఎఎస్సై జయకుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గౌరి శంకరపురానికి చెందిన హరీశ్(27) ఈనెల 7న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిపోయాడు. ఆతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్లలో వెతికినా.. ఫలితం లేకపోయింది. అతని తండ్రి వెంకట రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

News June 9, 2024

ఫాగింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని కోర్టు రోడ్ లో ఉన్న గుల్జార్ పేట్ ప్రాంతంలో ఫాగింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలో మురుగు నీరు నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ వేయాలని సూచించారు.

News June 9, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ఆలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ ఆలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం ఆలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి పేరు తెస్తానన్నారు. 

News June 9, 2024

అనంత అభివృద్ధికి అధికారులు సహకరించాలి: కలెక్టర్

image

అనంత నియోజకవర్గ అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో వరద నిర్వహణలో భారీ వర్షం వచ్చి ఎక్కువ నీరు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడ ప్రభావితం అవుతుంది అనే దానిపై వచ్చే 72 గంటల్లోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.

News June 9, 2024

యర్రగుంట్ల SBIలో వ్యాపించిన మంటలు

image

శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 9, 2024

తిరుమల అడిషనల్ ఎస్పీ వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలి

image

తిరుమల అడిషనల్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న యం శివరామి రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆయనను వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీని వెంటనే పంపాలని, మరొకరిని ప్రత్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని తిరుపతి ఎస్పీకి సూచించారు. ఈ ఉత్తర్వులపై బదిలీ చేశారా.. ఏదైన చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

News June 9, 2024

గుంటూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

అరుణాచలంలో జూన్ 22న పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ మహోత్సవాలకు గుంటూరు 2 డిపో నుంచి స్పెషల్ బస్ ఏర్పాటు చేశామని DM అబ్దుల్ సలాం శనివారం తెలిపారు. ఈ బస్ జూన్ 20న రాత్రి గుంటూరులో బయలు దేరి, 21న శ్రీకాళహస్తి, కాణిపాకం, 22న ఉదయం అరుణాచలం చేరుతుందన్నారు. స్వామిని దర్శించుకుని 22వ తారీకు సాయంత్రం అరుణాచలంలో బయలు దేరి 23 ఉదయం గుంటూరు చేరుకుంటారన్నారు.

News June 9, 2024

శుద్ధ ముక్కపై రామోజీరావు కు సూక్ష్మ కళాకాండంతో శ్రద్ధాంజలి

image

ఈనాడు అధినేత రామోజీరావు మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామోజీరావు సూక్ష్మ చిత్రాన్ని శుద్ధ ముక్కపై చెక్కారు. శుద్ధ ముక్కపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కేందుకు మూడు గంటల సమయం పట్టిందని కొత్తపల్లి రమేష్ తెలిపారు.