Andhra Pradesh

News June 9, 2024

పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తా: ఎస్పీ

image

నెల్లూరు జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావించి “పోలీస్ వెల్ఫేర్ డే” ని జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పారదర్శకతతో కోరుకున్న చోటుకే ఖాళీల ఆధారంగా స్థానచలనం చేశారు.

News June 9, 2024

విజయనగరం: ‘రైలు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

రైలు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ డీటీఐ సీహెచ్వీ. రమణ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే పురస్కరించుకుని స్థానిక వీటీ. అగ్రహారం సమీపంలో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే క్రాసింగ్ ఉన్నప్పుడు ప్రయాణీకులు గేట్ల కింద దూరి వెళ్లరాదన్నారు.

News June 9, 2024

పాడేరు: జాతర సందర్భంగా 800 మంది పోలీస్ సిబ్బంది

image

ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ పాడేరులో జరగనున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈమేరకు 800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు జరగకుండా నివారించడానికి పది క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

News June 9, 2024

ఉప్పాడ: కోతకు గురవుతున్న బీచ్‌ రోడ్డు

image

తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ- కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. దీంతో బీచ్ రోడ్డు శనివారం కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీర ప్రాంత ప్రజల రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News June 9, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

బాపట్ల ప్రమాద ఘటనలో.. గాయాలైన వ్యక్తి మృతి

image

బాపట్ల- గుంటూరు రహదారిలో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ<<13403251>> యువకుడు మృతి చెందాడు. <<>>బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. అంకమ్మరావు అనే యువకుడు కొత్త బైక్ కొనడానికి పొన్నూరు వెళ్తుండగా స్నేహితుడు బైక్ నడుపుతూ చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో వెనక కూర్చున్న అంకమ్మరావుకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

News June 8, 2024

విశాఖ: టికెట్ చెకింగ్ సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు

image

విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో చెకింగ్ సిబ్బందికి డీఆర్ఎం సౌరం ప్రసాద్ బాడీ వోర్న్ కెమెరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకత, జవాబుదారీతనం భద్రతను పెంచడానికి ఈ కెమెరాలు దోహద పడతాయన్నారు. రైళ్లలోను, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీ ప్రక్రియను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News June 8, 2024

రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే.. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు గ్రూప్ అడ్మిన్లను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం వాట్సప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నట్టు సమాచారం వస్తోందని, అలాంటి పోస్టులకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు.

News June 8, 2024

పార్వతీపురం: రైలు కిందపడి యువకుడు మృతి

image

రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం దాలినాయుడు వలస రైల్వే గేట్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం బూరాడ వీధికి చెందిన తెంటు భరత్ (31) రైల్వే గేట్ దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

మాజీ మంత్రి జక్కంపూడి సోదరుడు కన్నుమూత

image

మాజీ మంత్రి, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు (చిన్ని) శనివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్ని మరణ వార్తతో జక్కంపూడి అభిమానులు నారాయణపురంలోని వారి నివాసానికి చేరుకుని చిన్ని పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.