Andhra Pradesh

News June 8, 2024

అనంత: అనతికాలంలో ఎన్నికల బరిలో నిలిచి.. ఎమ్మెల్యేగా గెలిచి

image

టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉద్యమాలతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో టీడీపీలో చేరిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే ఆయనపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. మడకశిరలో తక్కువ సమయంలోనే ప్రజాదరణతో గెలుపొందారు.

News June 8, 2024

ఏడీ సెట్-24 రద్దు: వైఎస్ఆర్‌ఏఎఫ్ యూలో నేరుగా ప్రవేశాలు

image

కడప నగర పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఏడీసెట్-2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేసినట్లు ఏడీసెట్ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 8, 2024

విశాఖలో డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి

image

విశాఖలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని ఓ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులకు సహాయంతో గెడ్డలో పడిపోయిన వ్యక్తిని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 45 వయస్సు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ ‌(2015-16, 2016-17 అడ్మిట్ బ్యాచ్) పరీక్షల టైం టేబుల్‌ను ఎగ్జామినేషన్ బీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులు గమనించగలరని ఆయన కోరారు.

News June 8, 2024

యర్రగొండపాలెం: వేగినాటి కోటయ్యగా పేరు మార్పిడి

image

వైసీపీ అధికారంలోకి రాగానే యర్రగొండపాలెంలోని పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేత వేగినాటి కోటయ్య పేరును తొలగించి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరు మార్చారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా వేగినాటి కోటయ్య పేరును ఇవాళ పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేతలు మారుస్తున్నారు.

News June 8, 2024

సిక్కోలులో YCP చతికిలపడడానికి కారణం ఇదేనా..

image

సిక్కోలులో YCP ఘోరంగా చతికిలపడింది. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇంత పరాభవం చెందలేదు. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలోని ఒక MP, సహా 8 అసెంబ్లీలో ఓటమిపాలైంది. అసెంబ్లీలో జిల్లా నుంచి ఒక్క MLA కూడా లేరు. ఐదేళ్లలో జిల్లాలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోవడం, రోడ్లు శిథిలమైనా కనీసం మరమ్మతుల ఊసే లేకపోవడం, జిల్లా అభివృద్ధిని విస్మరించడంతో దాని ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని ప్రజలు నుంచి వినిపిస్తోంది.

News June 8, 2024

ప.గో.: RRRపై ఏకైక మహిళ పోటీ.. ఓట్లు ఎన్నంటే

image

ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ MLAగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీచేయగా.. అందులో మల్లిపూడి షర్మిల ఒక్కరే మహిళ. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆమెకు 1140 ఓట్లు వచ్చాయి. అయితే RRRకు 1,16,902 ఓట్లు రాగా.. 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 8, 2024

విజయనగరం : ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరిక్ష

image

బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 90% మంది విద్యార్థులు హాజరయ్యారని అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ఈ పరీక్షకు MVGR కళాశాలలో 120 మందికి 103 మంది విద్యార్థులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది విద్యార్థులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేసారు.

News June 8, 2024

నంద్యాల జిల్లాలోని మండలాలలో వర్షపాతం వివరాలు

image

నంద్యాల జిల్లాలో 16 మండలాలలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 65.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గోస్పాడు 46.2మి.మీ పాణ్యం 44.6, బండి ఆత్మకూరు 42.6, ఉయ్యాలవాడ 42.4, దొర్నిపాడు 42.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా గడివేముల 3.4 మిమీ, డోన్ 0.8 వర్షపాతం నమోదైంది.

News June 8, 2024

ఉరవకొండ: ఏటీఎం ధ్వంసం చేసి.. నగదు చోరీ

image

కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దానిలోని నగదును అపహరించారు. ఎంత మొత్తంలో నగదు అపహరించారో తెలియడం లేదు. స్టేట్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.