Andhra Pradesh

News June 8, 2024

చిత్తూరు జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. చిత్తూరు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి రేసులో పులివర్తి నాని, గాలి బానుప్రకాశ్, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉన్నట్లు అలికిడి వినిపిస్తోంది.

News June 8, 2024

గుంటూరు నుంచి ఔరంగాబాద్‌కు రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-ఔరంగాబాద్- గుంటూరు మధ్య రైలును ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ద.మ. రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఔరంగాబాద్‌ 13.20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17254) ఔరంగాబాద్‌లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటి రోజు 21.30 గంటలకు చేరుతుంది.

News June 8, 2024

జగన్‌ను కలవకుండా సీఎంఓ అడ్డుపడింది : కేతిరెడ్డి

image

వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ను ప్రజా ప్రతినిధులు కలవాలంటే సీఎంఓ దూరం పెట్టిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ధర్మవరంలో రైల్వే ఉపరిత వంతెన నిర్మాణ భూసేకరణకు రూ.15 నుంచి 20 కోట్లు మంజూరు కోసం సీఎం కార్యాలయం చూట్టూ, గుంతలు పడిన రోడ్ల నిధుల కోసం ఫైనాన్స్ సెక్రటరీ వద్దకు యాభైసార్లు తిరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మేనిఫెస్టో మీద నమ్మకం పెట్టుకున్నారన్నారు.

News June 8, 2024

శ్రీకాకుళం: కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు..!

image

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధిక స్థానాలు రావడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. శ్రీకాకుళం ప్రతినిధి కేంద్ర కేబినెట్‌లో టీడీపీ వాటా కింద రాష్ట్ర ఎంపీలో రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి రావచ్చని టీడీపీ నాయకులు ఆశిస్తున్నాను. శ్రీకాకుళం ఎంపీగా మూడుసార్లు గెలుపొందారు. వాజ్ పేయీ హయాంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు.

News June 8, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎక్కడ.?

image

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

News June 8, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎక్కడ.?

image

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

News June 8, 2024

2024 ఎన్నికల్లో మారిన రాజంపేట సెంటిమెంట్

image

4 దశాబ్దాలుగా రాజంపేటలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వస్తోంది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం సాధించగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి అమర్ నాథ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆకేపాటి ప్రతిపక్షానికి పరిమితం అవుతున్నారు.

News June 8, 2024

అనకాపల్లిలో 40 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బీజేపీ

image

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రికార్డును BJP బ్రేక్ చేసింది. 1962లో జరిగిన పునర్విభజనలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ కేంద్రమయ్యింది. అప్పటినుంచి 2019వ రకు టీడీపీ ఎంపీ పి.అప్పల నరసింహం మెజారిటీ రికార్డుగా ఉండేది. ఆయన సాధించిన 1.74 లక్షల ఓట్ల మెజార్టీని 40 ఏళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిగమించారు. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడుపై 2.96 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News June 8, 2024

టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి?

image

కడప ఎంపీ స్థానానికి కూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. దీంతో టీడీపీ బోర్డు ఛైర్మన్‌కు భూపేశ్ అర్హుడని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీనిపై భూపేశ్ స్పందన తెలియాల్సి ఉంది.

News June 8, 2024

చిత్తూరు: కరెంటు షాక్ కొట్టి చిన్నారికి తీవ్రగాయాలు

image

కరెంటు షాక్ కొట్టి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. రెడ్డిస్ కాలనీకి చెందిన లలిత్ ఆదిత్య (10) ఇంటి మిద్దెపై కమ్మితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే వెళ్తున్న విద్యుత్తు లైనుకు తగిలించాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు.