Andhra Pradesh

News June 8, 2024

భావనగర్- కాకినాడ పోర్ట్ రైలు దారి మళ్లింపు

image

భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

News June 8, 2024

భావనగర్- కాకినాడ పోర్ట్ రైలు దారి మళ్లింపు

image

భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

News June 8, 2024

సోమిరెడ్డికి మంత్రి పదవి?

image

నెల్లూరు జిల్లా TDP సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లిలో 2 దశాబ్దాల తర్వాత సోమిరెడ్డి TDP జెండా ఎగురవేశారు. నారా లోకేశ్‌ను ఆయన నిన్న ప్రత్యేకంగా కలవడంతో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత టీడీపీ హయాంలో ఆయన మంత్రి(MLC కోటా)గా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పదవి దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News June 8, 2024

మదనపల్లెలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

image

యజమాని వేధింపులు భరించలేక
ట్రాక్టర్ డ్రైవర్ చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. బసినికొండ పంచాయతీ, జన్మభూమి కాలనీకి చెందిన సైసావల్లి(35) నవీన్ వద్ద రూ.90 వేలు అప్పుగా తీసుకుని ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తానిచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని యజమాని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

కర్నూలు జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దాదాపు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News June 8, 2024

అనంతపురం జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో.?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News June 8, 2024

ఈనెల 13న స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు

image

స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఈనెల 13న జీతాలు చెల్లించనున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ తెలియజేసినట్లుకార్మిక నాయకులు తెలిపారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో జీతాలు చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిఎండి 13న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు.

News June 8, 2024

భూపేశ్‌రెడ్డి ఓటమికి కారణం ఇదేనా?

image

కడప TDP MP అభ్యర్థిగా పోటీ చేసిన భూపేశ్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణం క్రాస్ ఓటింగ్ అని తెలుస్తోంది. జిల్లాలో కూటమి గెలిచిన 5 స్థానాల్లో MLA అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ 1,05,102 ఓట్లు. ఆ స్థానాల్లో MP అభ్యర్థి భూపేశ్‌కు వచ్చిన మెజార్టీ 23,332 ఓట్లు. వీటి మధ్య తేడా 81,770 ఓట్లు. భూపేశ్‌ 65,490 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అంటే.. MLA ఓటు కూటమికి వేసి, MP ఓటు కాంగ్రెస్‌ లేదా YCPకి వేసినట్లు స్పష్టమవుతోంది.

News June 8, 2024

ప్రకాశం: నవజాత శిశువు మృతిపై కేసు నమోదు

image

కురిచేడులోని తాగునీటి చెరువులో నవజాత శిశువు మృతదేహం పడేసిన విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎస్సై చెప్పారు. ఎవరు ఆ మృతదేహాన్ని చెరువులో పడేశారు. అసలు మృతదేహం ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News June 8, 2024

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో 26 జిల్లాలకు కేటాయించాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఐతే మంత్రి రేసులో అచ్చెన్న, కూన, అశోక్‌లు ఉన్నట్లు సమాచారం.