Andhra Pradesh

News June 7, 2024

కర్నూలు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య 

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జామున కైరన్ బీ(26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుట్టింటికి పంపలేదని అత్తింటి వేధింపులతో తాళలేక మనస్తాపంతో వేకువజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News June 7, 2024

వేట కొడవళ్లతో వీరంగం సృష్టించారని చెప్పడం అసత్య ప్రచారం: ఎస్‌పీ

image

రామగిరి మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో వేట కొడవళ్లు పట్టుకొని వీరంగం సృష్టిస్తున్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల తర్వాత కొందరు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదన్నారు. సంబరాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేమన్నారు.

News June 7, 2024

పార్వతీపురం: పోస్టల్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పే అవకాశం

image

సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా గెలిచిన నాయకులకు ఈ పోస్ట్ సర్వీస్ ద్వారా అభినందనలు తెలిపే వెసులుబాటును పోస్టల్ శాఖ కల్పించిందని సూపరింటెండెంట్ రెడ్డి బాబురావు రావు అన్నారు. కేవలం రూ.10 చెల్లించి సమీప తపాలా కార్యాలయంలో ఈ పోస్టు ద్వారా తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు అన్నారు. ఇలా పంపించిన సందేశాలు నేరుగా నేతలకు వెళ్తాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News June 7, 2024

నెల్లూరు: గాలివానకు ఓ ఇంటిపై పడిన విద్యుత్ స్తంభం

image

ఉదయగిరి మండలంలోని గండిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభం కూలిపోయి ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. అకాల వర్షం పడి రైతులకు పండ్లతోటల యజమానులకు ఊరటనిచ్చింది.

News June 7, 2024

చిత్తూరు: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

image

ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములకల చెరువులో జరిగింది. ఎస్సై తిప్పేస్వామి వివరాల ప్రకారం. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25) పొరుగు గ్రామానికి చెందిన మైనర్(17)తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆ ప్రేమజంట బత్తలాపురం అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని ఎస్‌ఐ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News June 7, 2024

కోనసీమ: పార్టీలు మారినా ఫలితం దక్కలే..!

image

కోనసీమ జిల్లాలో కొందరు నేతలు పార్టీ మారి పోటీ చేసినా గెలవలేదు. TDP నుంచి YCPలో చేరి మండపేట బరిలో దిగిన త్రిమూర్తులు.. JSP నుంచి YCPలో చేరి అమలాపురం MP అభ్యర్థిగా దిగిన రాపాక.. TDPని వీడి YCP తరఫున రాజోలు నుంచి పోటీ చేసిన గొల్లపల్లి.. YCP టికెట్ దక్కక కాంగ్రెస్‌లో చేరిన చిట్టిబాబు ఈ ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకున్నారు. కాగా.. YCP నుంచి TDPలో చేరిన వాసంశెట్టి మాత్రమే రామచంద్రపురంలో గెలిచారు.

News June 7, 2024

VS యూనివర్సిటీలో శిలాఫలకం ధ్వంసం

image

నెల్లూరులోని VS యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ముందున్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గడ్డపారలతో శుక్రవారం ధ్వంసం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 7, 2024

వరదరాజుల రెడ్డి మంత్రి కావాలని అహోబిలంలో ప్రత్యేక పూజలు

image

ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన నంద్యాల వరదరాజులరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని మండలం కామనూరుకు చెందిన యువకులు అహోబిలం క్షేత్రంలోని నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కామనూరు చెందిన మల్లికార్జున్ రెడ్డి, సునీల్ కుమార్, సురేంద్ర యాదవ్, దస్తగిరి యాదవ్, శివచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేశారు.

News June 7, 2024

జర్నలిస్టుల సహకారం మరువలేనిది: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారన్నారు. వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.

News June 7, 2024

నాకు కూడా బాధగా ఉంది బ్రదర్: కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ‘X’ లో చేసిన ఓ ట్వీట్‌కు అతని అభిమాని ‘అన్నా నీకు టిక్కెట్‌ రానందుకు ప్రతి కార్యకర్త బాధపడ్డాడు. భవిష్యత్తులో మీకు మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను. బాబు గారు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్న’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి నాగార్జున ‘164లో భాగం కాలేకపోయాను అన్న బాధ నాకు కూడా ఉంది బ్రదర్’ అంటూ రిప్లే ఇచ్చారు.