Andhra Pradesh

News June 7, 2024

తంబళ్లపల్లె : వైసీపీ ఓటమి…కీలక పదవికి రాజీనామా

image

ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌ పదవికి మిట్టపల్లి భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. కన్నబాబుకు పంపించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు .

News June 7, 2024

చెవిటి పిల్లలకు విజయనగరంలో ప్రత్యేక పాఠశాల

image

విజయనగరం పేర్ల వారి వీధిలో గల చెవిటి పిల్లల పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు సెక్రటరీ కె.ఆర్.డి ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేది నుండి ఉ 9 గం.లనుండి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉచిత విద్య, బాలబాలికలకు వేరు వేరు హాస్టల్లో ఉచిత వసతి కల్పించబడునని, డిజిటల్ క్లాస్ ద్వారా పాఠాలు బోధించబడునన్నారు. వివరాలకు సంప్రదించాలన్నారు.

News June 7, 2024

VZM: వైసీపీ కార్యకర్తలకు అండగా పదిమందితో కమిటీ

image

YCP కార్యకర్తలపై దాడులు జరిగితే వారికి అండగా ఉండేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను పార్టీ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 10 మందితో కమిటీని నియమించింది. కమిటీలో బొత్స సత్యన్నారాయణ, సూర్యనారాయణ రాజు, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాస్, తలే రాజేష్, శంబంగి అప్పలనాయుడు, అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాస్ ఉన్నారు.

News June 7, 2024

AU: జూలై 31 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలను జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 31న కాంటెంపరరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ఒకటో తేదీన జెండర్ స్కూల్ అండ్ సొసైటీ, 2వ తేదీన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.

News June 7, 2024

వెంకటగిరి చరిత్రతో ఒకే ఒక్కరు..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లలో కురుగొండ్ల ఒక్కరే వెంకటగిరి నియోజవర్గ చరిత్రలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు. నేదురమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు విజయం సాధించగా.. మిగిలిన ఎవరూ తిరిగి ఇక్కడి నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.

News June 7, 2024

ఎన్డీఏ కూటమి సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు

image

ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఫోటో దిగారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం పార్లమెంటు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

News June 7, 2024

ఎచ్చెర్ల: సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరి

image

జిల్లా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటిఐ) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐ, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో 3816సీట్లు ఉండగా, 2107మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 752మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారన్నారు. మిగిలిన1355 మంది ఈనెల10వ తేదీలోగా హాజరుకావాలి.

News June 7, 2024

తొలిసారి బరిలో నిలిచినా కేశినేని శివనాథ్ రికార్డ్

image

విజయవాడ లోక్‌సభకు 1952 నుంచి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికలలో కేశినేని శివనాథ్ (చిన్ని) సాధించిన 2,82,085 మెజారిటీనే అత్యధికం. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన KLరావు సాధించిన 1,56,004 ఓట్ల మెజారిటీని తాజా ఎన్నికల్లో చిన్ని తన భారీ మెజారిటీతో చెరిపేశారు. చిన్ని తాజా గెలుపుతో విజయవాడ లోక్‌సభలో వరుసగా 3వ సారి టీడీపీ జెండా ఎగిరింది.

News June 7, 2024

అద్దంకిలో భారీ చోరీ

image

అద్దంకిలోని ఆయిల్ మిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం, రూ.2.25 లక్షలు నగదు, 3 రకాలైన డైమండ్స్‌ను దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెల్లం రాజేశ్ ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుండగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. ఇంటి యజమాని తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రాజేశ్‌కి సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 7, 2024

AU: జూలై 9 నుంచి బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను జూలై 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ (ఎగ్జామినేషన్స్) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. తేదీల వారీగా పరీక్షలు వివరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.