Andhra Pradesh

News June 7, 2024

ఒడిశాలో బీజేపీ.. కొఠియా, జంఝావతి సమస్య కొలిక్కి వచ్చేనా..!

image

కేంద్రంలో TDP కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న తరుణంలో కొఠియా, జంఘావతి సమస్యలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఒడిశాలో BJP ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఒడిశాలో పలు గ్రామాలతో పాటు కొంత భూభాగం ముంపునకు గురవ్వడంతో రబ్బరు డ్యాం నిర్మించాల్సి వచ్చింది. కొఠియా ప్రజల అభీష్టం మేరకు వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News June 7, 2024

అవుకు మండలంలో పొంగిపొర్లుతున్న వాగు

image

అవుకు మండల పరిధిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఎర్రమల కొండలనుంచి పారే జక్కలేరు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండల మధ్య నుంచి పారుతున్న జక్కలేరు వంక జలపాతాలు పకృతి అందాలు ఊటీని తలపిస్తూ పర్యాటకులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. అటు వర్షపు నీటి కారణంగా రిజర్వాయర్‌లో నీటి శాతం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 7, 2024

కడప: నలుగురికి హ్యాట్రిక్ మిస్

image

ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జయకేతనం ఎగరేసింది. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన నలుగురు అభ్యర్థులు హ్యాట్రిక్ మిస్ అయ్యారు. వారిలో
ఎస్.రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. కాగా శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఈసారి ఓటమి పాలయ్యారు. దీంతో దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకులు ఓటమి రుచి చూశారు.

News June 7, 2024

అనంతపురం : ‘కిలో టమాటా రూ.50’

image

మండుతున్న కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి తీవ్రత, సాగునీటి కొరత, తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో కూరగాయల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా వీటి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. టమాటా, పచ్చి మిరపకాయల ధర కొండెక్కాయి. టోకు మార్కెట్లో (పాతూరు మార్కెట్) కిలో టమాటా ధర రూ.50, పచ్చి మిరపకాయలు కిలో రూ.100 పలుకుతుంది.

News June 7, 2024

SKLM: పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) శుక్రవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎర్రయ్య తన సహచరులతో వేటకు వెళ్లిన కొద్దిసేపటికి పడవ అదుపుతప్పి నడి సముద్రంలో బోల్తా పడింది. మత్స్యకారులు ఈదుకుంటూ బోల్తా పడిన తెప్ప పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా ఎర్రయ్యకు గాయాలు కావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.

News June 7, 2024

యర్రగొండపాలెంలో TDPని దెబ్బకొట్టింది ఇవే

image

రాష్ట్రంలో TDP ప్రభంజనం వీసినప్పటికీ వై.పాలెంలో గెలవలేకపోవటం పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే TDP గెలుపును నోటా, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు దెబ్బతీశాయని చెప్పవచ్చు. YCP అభ్యర్థి చంద్రశేఖర్ 5,200 ఓట్లతో గెలిచారు. కాగా నోటాకు 2,222 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అజితారావుకు 2,166 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు పడిన ఓట్లు దాదాపు టీడీపీవే అని మా గెలుపును దెబ్బతీశాయని పలువురు అంటున్నారు.

News June 7, 2024

పెద్దపప్పూరు: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామంలో అశ్విని అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై అమానుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజినేయులు కుమార్తె అశ్విని ఇంటర్ మీడియట్ చదువు మధ్యలో ఆపేసింది. చదువుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 7, 2024

విజయనగరం: మూడు కేంద్రాల్లో ఎడ్ సెట్

image

ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎడ్‌సెట్-24 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని పరిశీలకులు ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, అయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ కళాశాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఉ 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందని, 850 మంది పరీక్ష రాస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లలో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.

News June 7, 2024

బాబును కలిసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

image

నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సత్యవేడు కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ‘మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’  అంటూ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదిమూలానికి సూచించారు.

News June 7, 2024

అనంత: జేఎన్‌టీయూ బీటెక్‌ ఎంఓఓసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్‌ మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు(ఎంఓఓసీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్‌ కేశవ రెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మే నెలలో తృతీయ సంవత్సరం 2వ సెమిస్టర్‌, నాల్గవ సంవత్సరం 1వ సెమిస్టర్‌ (ఆర్‌20) ఎంఓఓసీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.