Andhra Pradesh

News June 7, 2024

అనంత: జేఎన్‌టీయూ బీటెక్‌ ఎంఓఓసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్‌ మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు(ఎంఓఓసీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్‌ కేశవ రెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మే నెలలో తృతీయ సంవత్సరం 2వ సెమిస్టర్‌, నాల్గవ సంవత్సరం 1వ సెమిస్టర్‌ (ఆర్‌20) ఎంఓఓసీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News June 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై దృష్టి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.

News June 7, 2024

కాకినాడ: 3 పార్టీల నుంచి పోటీ.. నాలుగు సార్లు ఓటమి

image

పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌కు రాజకీయాలు కలిసిరాలేదనడానికి తాజా ఓటమి బలం చేకూరుస్తోంది. తొలిసారి 2009లో కాకినాడ పార్లమెంట్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పరాజయం పొందారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి బరిలో నిలవగా..37.06 శాతం ఓటింగ్‌తో మళ్లీ ఓటమి తప్పలేదు. ఈయన మొత్తం 4 సార్లు పోటీ చేయగా.. 3 పార్టీల నుంచి బరిలో నిలవడం గమనార్హం.

News June 7, 2024

విశాఖ: రేపు ఎడ్ సెట్ ప్రవేశపరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ టీవీ కృష్ణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. నిర్దిష్ట సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

News June 7, 2024

శ్రీకాకుళం: గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన 60 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డులో గల స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.

News June 7, 2024

ప.గో.: ఆ MLA రాష్ట్రంలో 6వ స్థానం.. జిల్లాలో TOP

image

తణుకు నియోజకవర్గంలో కూటమికి భారీగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,34,575 ఉండగా.. 1,93,046 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 82.16 శాతం పోలింగ్ నమోదైంది. కాగా TDPకి 66.39 శాతం ఓట్లు రాగా.. వైసీపీ 29.52 శాతానికి పరిమితమైంది. వెరసి ఇక్కడ గెలుపొందిన కూటమి MLA అభ్యర్థి ఆరిమిల్లి మెజారిటీ పరంగా రాష్ట్రంలోనే 6వ స్థానంలో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచారు. 72121 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే.

News June 7, 2024

నూజివీడు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

image

నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్‌ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్‌ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.

News June 7, 2024

పిఠాపురం: YS.జగన్‌కు ధన్యవాదాలు: వంగా గీత

image

ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం పిఠాపురం రాజుగారి కోటలోని వైసీపీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌‌లు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన YS.జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News June 7, 2024

TDP ప్రభుత్వంలో మార్కాపురం జిల్లా.?

image

వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ప్రజల ఆకాంక్ష. జిల్లాలో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీనినే TDP ఆయుధంగా తీసుకొని అధికారం చేపడితే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుందని ప్రజలు ధీమాగా ఉన్నారు. మరి TDP ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా!

News June 7, 2024

మెట్టు స్వగ్రామంలో టీడీపీకి మెజారిటీ

image

రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు 41,659 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెుదటి రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో కొనసాగింది. కాగా రాయదుర్గం పట్టణంలో టీడీపీకి 16,200 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి స్వగ్రమామైన బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలో మెుదటిసారి టీడీపీకి 337 ఓట్ల మెజారిటీ వచ్చింది.