Andhra Pradesh

News June 5, 2024

తిరుపతి : MED ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో ఎంఈడీ( MEd) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News June 5, 2024

అనంత: ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

image

అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అధిక శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులకు 15058 ఓట్లు, వైసీపీ అభ్యర్థులకు 7598 ఓట్లు వచ్చాయి. అందులో అధికంగా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు 4272, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు 2406 వచ్చాయి.

News June 5, 2024

విశాఖ: తండ్రి ప్రతీకారాన్నీ తీర్చుకున్న తనయుడు

image

గాజువాకలో గుడివాడ అమర్నాథ్‌పై గెలిచి పల్లా శ్రీనివాసరావు రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. 1989లో గుడివాడ గురునాథరావు, పల్లా సింహాచలంపై 13,903 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 35 ఏళ్ల తర్వాత వారి వారసులు గాజువాకలో పోటీపడ్డారు. పల్లా శ్రీనివాసరావు తన తండ్రి ఓటమికి ప్రతీకారంగా అమర్నాథ్‌పై 95,235 ఓట్ల మెజార్టీతో విజయకేతనాన్ని ఎగురవేశారు.

News June 5, 2024

కౌంటింగ్ సమయంలో గుడ్డుపై ఈకలు పీకారా: MS రాజు

image

మడకశిరలో ఈవీఎంలు మార్చారనే వ్యాఖ్యలపై మడకశిర తాజా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కోడి గుడ్డుపై ఈకలు పీకారా అంటూ వైసీపీపై ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు అక్కడే ఉన్నారన్నారు. వైసీపీ పార్టీ ఏజెంట్లు ఇతర అధికారులు ఉండగా ఈవీఎం ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడా మార్చలేదని స్పష్టం చేశారు.

News June 5, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాం: కలెక్టర్

image

జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

News June 5, 2024

నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే

image

నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్‌వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009,19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

News June 5, 2024

డోన్: తొలిసారి అసెంబ్లీలోకి మాజీ సీఎం వారసుడు

image

డోన్‌లో టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను 6 వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైన జయసూర్యప్రకాశ్ రెడ్డి గతంలో మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగానూ ఆయన పనిచేశారు. ఈ సీనియర్ లీడర్ తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

News June 5, 2024

ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం: ఎస్పీ

image

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచామని పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. 

News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

News June 5, 2024

నెల్లూరు జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది వీరే..!

image

నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.