Andhra Pradesh

News June 5, 2024

డోన్: తొలిసారి అసెంబ్లీలోకి మాజీ సీఎం వారసుడు

image

డోన్‌లో టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను 6 వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైన జయసూర్యప్రకాశ్ రెడ్డి గతంలో మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగానూ ఆయన పనిచేశారు. ఈ సీనియర్ లీడర్ తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

News June 5, 2024

ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం: ఎస్పీ

image

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచామని పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. 

News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

News June 5, 2024

నెల్లూరు జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది వీరే..!

image

నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.

News June 5, 2024

‘పిఠాపురంలో పనిచేయని జగన్ వ్యూహం’

image

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వ్యూహాలను ప్రయోగించారని, అవేమీ పనిచేయలేదని కూటమి శ్రేణులు, జనసైనికులు అంటున్నారు. పిఠాపురంలోనే జగన్ ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినా, హామీలు కుమ్మరించినా, వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్నా.. వాటి ప్రభావం ఫలితాల్లో ఎక్కడా కనిపించలేదన్నారు.

News June 5, 2024

NEETలో మెరిసిన కడప బిడ్డ

image

నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం కస్పాకు చెందిన బండపల్లి మేఘన, బండపల్లి మధుసూదన్ రెడ్డిల కుమార్తె బండపల్లి నేహా రెడ్డి మెరిశారు. నేహా రెడ్డి 670 మార్కులు సాధించి ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటాలో 1651వ ర్యాంక్ సాధించారు. కృషి, పట్టుదలతో విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని 670 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

News June 5, 2024

తూ.గో: అసెంబ్లీకి ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

➤ సీనియర్లు: గోరంట్ల (7వసారి), వేగుళ్ల (5వసారి), బండారు (4వసారి), జ్యోతుల నెహ్రూ (3వసారి), చినరాజప్ప (3వసారి), నల్లమిల్లి (2వసారి), ఆనందరావు (2వసారి), కొండబాబు (2వసారి), దాట్ల సుబ్బరాజు (2వసారి), ముప్పిడి వెంకటేశ్వరరావు (2వసారి).
➤ తొలిసారి: పవన్, దివ్య, సత్యప్రభ, శిరీషాదేవి, గిడ్డి సత్యనారాయణ, నానాజీ, దేవవరప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ , వాసంశెట్టి, దుర్గేశ్, మద్దపాటి వెంకటరాజు.

News June 5, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులపైన అత్యధిక మెజారిటీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.

News June 5, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో పల్టీ కొట్టిన MRO కారు

image

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని అనంత విద్యానికేతన్ పాఠశాల సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. దెబ్బతిన్న కారు శింగనమల తహశీల్దార్‌దిగా గుర్తించారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతపురం నుంచి శింగనమలకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.

News June 5, 2024

ప.గో: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్‌ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.