Andhra Pradesh

News June 5, 2024

VZM: జిల్లాలో అతిది గజతిరాజుదే ఫస్ట్ ప్లేస్

image

ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అత్యధిక మెజార్టీ సాధించారు. మొత్తం 1,17,808 ఓట్లు పడగా.. 60,795 ఓట్ల మెజార్టీ వచ్చింది. జిల్లాలో గెలిచిన మిగతా అభ్యర్థులతో పోల్చితే ఇదే అత్యధికం. అదితి తరువాత 44,918 మెజార్టీతో బొబ్బిలి నుంచి బేబినాయన సెకెండ్ ప్లేస్‌లో నిలిచారు. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు 11,639 ఓట్ల మెజార్టీతో చివరి స్థానంలో నిలిచారు.

News June 5, 2024

డోన్: కోట్ల కుటుంబం నుంచి ముగ్గురు MLAలుగా గెలుపు

image

డోన్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982, డోన్ MLAగా, ఆయన కోడలు కోట్ల సుజాతమ్మ 2004, MLA గా గెలిచారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల ప్రకాష్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుగ్గన పై భారీ మెజార్టీతో డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఒకే నియోజకవర్గంలో నుంచి ఒకే కుటుంబంలో ముగ్గురినీ డోన్ ఆదరించింది.

News June 5, 2024

తూ.గో: మాజీ స్పీకర్ల వారసులను వరించిన విజయం

image

లోక్‌సభ, అసెంబ్లీ మాజీ స్పీకర్ల వారసులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
లోక్‌సభ మాజీ స్పీకర్‌ స్వర్గీయ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ 3,42,196 ఓట్ల మెజార్టీతో అమలాపురం ఎంపీగా అఖండ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య 15,277 ఓట్ల మెజార్టీతో తుని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

News June 5, 2024

ప.గో: చంద్రబాబు కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నూతనంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ పాల్గొన్నారు. 

News June 5, 2024

ధర్మవరంలో నోటాకు 1787 ఓట్లు

image

ధర్మవరం నియోజక వర్గంలో నోటాకు 1787 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ రోజు 2,20,455 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డికి 102810 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు 106544 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్వర్థ నారాయణకు 3758 ఓట్లు వచ్చాయి. మిగిలిన 13 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.

News June 5, 2024

ఎచ్చెర్ల: పాత్రికేయుడి నుంచి ఎంపీగా..

image

రణస్థలం మండలం, వీఎన్ పురానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పాత్రికేయ వృత్తి నుంచి ఎంపీ వరకు ఎదిగారు. రణస్థలంలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ అప్పటి ఎచ్చెర్ల MLA స్పీకర్ కావలి ప్రతిభా భారతి అనుచరుడిగా మారారు. ఆమె అతడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం ఆయన TDP చేరారు. విజయనగరం YCP బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల మెజార్టీతో కలిశెట్టి విజయం సాధించారు.

News June 5, 2024

విజయవాడ తూర్పులో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన గద్దె

image

1967లో ఏర్పడిన విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌లో వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఎమ్మెల్యేగా టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రికార్డ్ సృష్టించారు. 2014,19లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గద్దె తాజా ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్ పై 49,640 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి విజయవాడ తూర్పులో మొట్టమొదటి హ్యాట్రిక్ కొట్టిన నేతగా రికార్డ్ సృష్టించారు.

News June 5, 2024

నెల్లూరు: ఆయన ఓడిపోయినా MPనే..!

image

వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయి రెడ్డికి ఘోర పరాభావం ఎదురైన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 2,45,902 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వీళ్లద్దరూ ఒకప్పుడు రాజ్యసభలో సహచర ఎంపీలుగా మెలిగారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి పదవీ కాలం పూర్తయి పోయింది. సో.. విజయసాయి రెడ్డి ఓడిపోయినా సరే ఎంపీగానే కొనసాగుతారు.

News June 5, 2024

ఓడిన రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన ఆమంచి

image

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుఫున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,295 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు. ఆమంచి ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ఓటమి చవిచూశారు.

News June 5, 2024

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం: ఎస్పీ

image

ఎన్నికల విధుల్లో పోలీసు సహా అందరి కృషి అభినందనీయమని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బుధవారం పోలీస్ ఆడిటోరియంలో విధులు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి, మీడియాకు, అధికారులకు అభినందన సభ నిర్వహించారు.