Andhra Pradesh

News June 5, 2024

ఎచ్చెర్ల: పాత్రికేయుడి నుంచి ఎంపీగా..

image

రణస్థలం మండలం, వీఎన్ పురానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పాత్రికేయ వృత్తి నుంచి ఎంపీ వరకు ఎదిగారు. రణస్థలంలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ అప్పటి ఎచ్చెర్ల MLA స్పీకర్ కావలి ప్రతిభా భారతి అనుచరుడిగా మారారు. ఆమె అతడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం ఆయన TDP చేరారు. విజయనగరం YCP బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల మెజార్టీతో కలిశెట్టి విజయం సాధించారు.

News June 5, 2024

విజయవాడ తూర్పులో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన గద్దె

image

1967లో ఏర్పడిన విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌లో వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఎమ్మెల్యేగా టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రికార్డ్ సృష్టించారు. 2014,19లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గద్దె తాజా ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్ పై 49,640 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి విజయవాడ తూర్పులో మొట్టమొదటి హ్యాట్రిక్ కొట్టిన నేతగా రికార్డ్ సృష్టించారు.

News June 5, 2024

నెల్లూరు: ఆయన ఓడిపోయినా MPనే..!

image

వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయి రెడ్డికి ఘోర పరాభావం ఎదురైన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 2,45,902 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వీళ్లద్దరూ ఒకప్పుడు రాజ్యసభలో సహచర ఎంపీలుగా మెలిగారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి పదవీ కాలం పూర్తయి పోయింది. సో.. విజయసాయి రెడ్డి ఓడిపోయినా సరే ఎంపీగానే కొనసాగుతారు.

News June 5, 2024

ఓడిన రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన ఆమంచి

image

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుఫున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,295 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు. ఆమంచి ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ఓటమి చవిచూశారు.

News June 5, 2024

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం: ఎస్పీ

image

ఎన్నికల విధుల్లో పోలీసు సహా అందరి కృషి అభినందనీయమని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బుధవారం పోలీస్ ఆడిటోరియంలో విధులు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి, మీడియాకు, అధికారులకు అభినందన సభ నిర్వహించారు.

News June 5, 2024

చిత్తూరులో బుల్లెట్ సురేశ్ రాజీనామా

image

మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి బుల్లెట్ సురేశ్ రాజీనామా చేశారు. చిత్తూరుకు చెందిన ఆయన మొదటి రెండేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఇటీవల మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నిన్న టీడీపీ గెలవడంతో రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News June 5, 2024

కడప జిల్లాలో అత్యల్ప, అత్యధిక మెజార్టీలు వీరికే

image

ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వీరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (61687) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి(2495) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. జగన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. మండిపల్లికి ఇది మొదటి గెలుపు.

News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

News June 5, 2024

నరసరావుపేటలో పనిచేయని నెల్లూరు సెంటిమెంట్

image

నరసరావుపేట లోక్ సభ ఎన్నికలలో ఈసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేయలేదు. 1999, 2004లో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి ఎంపీలుగా గెలిచారు. అదే సెంటిమెంట్‌తో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దించింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణ దేవరాయలు ఈ దఫా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.

News June 5, 2024

నంద్యాల: బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.