Andhra Pradesh

News June 5, 2024

శ్రీ సత్యసాయి: వ్యక్తి మృతదేహం లభ్యం

image

మడకశిర మండల పరిధిలోని గుర్రప్పకొండ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సగం కాల్చినట్టు గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

కడప: ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిసార్లు గెలిచారు

image

కడప జిల్లాలో ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారంటే..
* అరవ శ్రీధర్: మొదటి సారి
* పుత్తా చైతన్య రెడ్డి: మొదటి సారి
* రెడ్డప్పగారి మాధవిరెడ్డి: మొదటి సారి
* మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: మొదటి సారి
* పుట్టాసుధాకర్ యాదవ్: మొదటి సారి
* దాసరి సుధ: రెండోసారి
* వైఎస్ జగన్: మూడోసారి
* ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: మూడోసారి
* ఆదినారాయణ రెడ్డి: నాలుగోసారి
* నంద్యాల వరదరాజుల రెడ్డి: ఆరోసారి

News June 5, 2024

తూ.గో: నలుగురు మహిళామణుల విజయకేతనం

image

ఉమ్మడి తూ.గో జిల్లా నుంచి నలుగురు మహిళామణులు విజయకేతం ఎగురవేశారు. వీరిలో ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా.. ఒకరు పార్లమెంట్‌లో గళం వినిపించనున్నారు.
➠ పార్లమెంట్ స్థానం
☞ రాజమండ్రి- పురందీశ్వరి(BJP) (మెజార్టీ-2,39,139)
➠ అసెంబ్లీ స్థానాలు
☞ ప్రత్తిపాడు- వరుపుల సత్యప్రభ(TDP) (38,768+)
☞ తుని- యనమల దివ్య(TDP) (15,177 +)
☞ రంపచోడవరం-శిరీషాదేవి(TDP) (9,139+)

News June 5, 2024

ప.గో.: ఎక్కువసార్లు అసెంబ్లీకి వెళ్లింది వీరే

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఆచంట మాజీ MLA పితాని సత్యనారాయణ ప్రస్తుత విజయంతో 4వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే తాజా విజయంతో వరుసగా 3 సార్లు గెలిచిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించారు. తరువాతి వరుసలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు 3వ సారి అసెంబ్లీకి వెళ్తున్నారు.

News June 5, 2024

నంద్యాల తొలి మహిళా ఎంపీగా బైరెడ్డి శబరి

image

నంద్యాల తొలి మహిళా MPగా బైరెడ్డి శబరి రికార్డు నెలకొల్పారు. ఆమె తాత బైరెడ్డి శేషశయనారెడ్డి నందికొట్కూరు MLAగా 3సార్లు గెలిచారు. తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి 1994, 1999లో TDP తరఫున నందికొట్కూరు MLAగా విజయం సాధించారు. శబరి 2014లో పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత BJPలో చేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల TDPలో చేరి నంద్యాల MPగా 1,36,278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

News June 5, 2024

విజయనగరం: నాలుగు ఎన్నికలు.. నాలుగు పార్టీలు

image

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

News June 5, 2024

చంద్రబాబును కలిసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి

image

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కూటమి ఘనవిజయం సాధించేలా కృషి చేసినందుకు చంద్రబాబుకు మాగుంట ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట కొడుకు రాఘవరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. అనంతరం సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా మాగుంట కలిశారు.

News June 5, 2024

నెల్లూరు పాత కలెక్టర్‌కు భారీ ఓటమి

image

కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 54,844 ఓట్లే వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు నోటాకు 15,577 ఓట్లు పడ్డాయి. కాగా రాజు 1988 నుంచి 1992 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News June 5, 2024

డిపాజిట్ కోల్పోయిన పూతలపట్టు MLA

image

చిత్తూరు జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా డిపాజిట్ కోల్పోయాడు. ఆయనే ఎంఎస్ బాబు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన 29,163 ఓట్లతో భారీ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ సీటు ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఆయనకు కేవలం 2,820 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి మురళీ మోహన్ 15,634 ఓట్లతో గెలిచారు. దీంతో బాబు డిపాజిట్ కోల్పోయారు.

News June 5, 2024

గోదారోళ్ల దెబ్బ.. ఇక జనసేనకు ‘గాజు గ్లాస్’..!

image

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా గెలిచి TDP తర్వాత అత్యధిక MLAలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ఖరారు చేయనుండటం వారికి మరో గుడ్ న్యూస్. 21 స్థానాల్లో మన ఉభయ గోదావరి నుంచే 11 ఉండటం గమనార్హం. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలవగా.. జనసేన రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. మన ఉభయ గోదారోళ్లు ఎక్కడా వైసీపీని ఆదరించలేదు.