Andhra Pradesh

News June 5, 2024

శ్రీకాకుళం: ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విద్యార్థులకు అందించే బస్సు పాసులు నూతన విద్యా సంవత్సరంలో ఆర్టీసీ ఇచ్చే రాయితీలకు సంబంధించి పాత వెబ్‌సైట్ పనిచేయదని.. దాని స్థానంలో కొత్త వెబ్‌సైట్ తీసుకువస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో పనిచేయదని 8 వ తేదీ నుంచి యథావిధిగా పనిచేస్తుందన్నారు. ఎంఎస్ టీ పాసులు మంజూరు మరింత సులభతరం అవుతుందన్నారు.

News June 5, 2024

కడప: తొలిసారి పోటీచేశారు గెలిచారు..!

image

కడప జిల్లా నుంచి తొలిసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. వారిలో కడప టీడీపీ నుంచి పోటీచేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి, రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్, కమలాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు (6) ఎమ్మెల్యేగా గెలిచి నంద్యాల వరద రాజులరెడ్డి YSR, బిజివేముల వీరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సరసన చేరారు.

News June 5, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

పెద్దారవీడు మండలంలోని గోబూరు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యర్రగొండపాలెం మండలం చెన్నారాయుడుపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 5, 2024

పిఠాపురంలో TDP కౌన్సిలర్ కన్నుమూత

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రాంబాబు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలిసిన నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News June 5, 2024

తూ.గో: ముగ్గురు మంత్రులనూ ఓడించేశారు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని ముగ్గురు వైసీపీ మంత్రులనూ ఓటర్లు ఆదరించలేదు. రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్, తుని నుంచి దాడిశెట్టి రాజా ఓటమి చవి చూశారు. చెల్లుబోయినకు ఈ ఎన్నికల్లో 64,970 ఓట్లు (2019లో 75,365), పినిపేకు 65,394 ఓట్లు (2019లో 72,003), దాడిశెట్టికి 82,029 ఓట్లు (2019లో 92,459) వచ్చాయి.

News June 5, 2024

ఉమ్మడి తూ.గో.లో అతి పిన్న MLA ఈమెనే..

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 స్థానాల్లో గెలుపొందిన MLAలలో 40ఏళ్ల లోపు వారు ఇద్దరు కాగా.. 70 ఏళ్ల పైబడి ముగ్గురు ఉన్నారు. మోస్ట్ సీనియర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ప్రస్తుతం 7వ సారి MLAగా గెలిచారు.
☛ రంపచోడవరం- మిరియాల శిరీషాదేవి(30)
☛ తుని- యనమల దివ్య(40)
☛ పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప (71)
☛ జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ(73)
☛ రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి(78)

News June 5, 2024

నెల్లూరు: వరప్రసాద్‌కు దురదృష్టం..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో YCPని వీడిన వారంతా TDP, జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్క వరప్రసాద్‌కే ఆ అదృష్టం దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన గూడూరు MLAగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన BJPలో చేరి తిరుపతి పార్లమెంట్ టికెట్ సంపాదించారు. దీని పరిధిలోని 7 చోట్లా కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్ ఓట్ కారణంగా వరప్రసాద్ గట్టెక్కలేకపోయారు.

News June 5, 2024

శ్రీకాకుళం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగులు..!

image

ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరావు తొలిసారి పోటీ చేసి 29,089 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించడంతో .. ఎన్ ఈ ఆర్, వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌పై ఆధిక్యం చాటారు. అయితే ఇతనికి 2009 నుంచి సేవా కార్యక్రమాలలో మంచి పేరు ఉండడంతో ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

News June 5, 2024

జోగి రమేశ్ ఓటమికి కారణాలు ఇవేనా!?

image

కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో పెనమలూరు బరిలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై పోటీ చేసి 59,915 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మారడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, టీడీపీ కంచుకోట నుంచి పోటీ చేయడం జోగి రమేశ్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News June 5, 2024

జమ్మలమడుగులో రికార్డు బ్రేక్

image

జమ్మలమడుగులో ఓ రికార్డు బద్దలయింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు MLAగా గెలిచిన వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి నిలిచారు. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో YCP నుంచి, ఇప్పుడు BJP నుంచి పోటీచేసి కూడా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పొన్నపురెడ్డి శివారెడ్డి గెలిచారు. ఆయన రికార్డును ఆదినారాయణ రెడ్డి బ్రేక్ చేశారు.