Andhra Pradesh

News June 5, 2024

ప.గో.: ఆరుగురికి 50వేల ప్లస్ మెజారిటీ.. మీ కామెంట్..?

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గెలుపొందిన కూటమి MLAలలో ఒక్క పోలవరం మినహాయిస్తే.. అన్నీ చోట్ల 25 వేలకు పైగా మెజారిటీలు సాధించారు. మరోవైపు ఆరుగురు MLAలు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరి ఇంత భారీ మెజారిటీలకు కారణం టీడీపీ- జనసేన- బీజేపీ జత కట్టడమే అని లోకల్‌గా టాక్ నడుస్తోంది.
– మీరేమంటారు..?

News June 5, 2024

గిద్దలూరులో నోటాకు అధిక ఓట్లు

image

గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ముత్తుముల కంటే నోటాకే ఇక్కడే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగ్గా ప్రతి రౌండ్లో ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో నోటాకు అత్యధికంగా 174 ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో 21 రౌండ్లలో నోటాకు 2,233 ఓట్లు వచ్చాయి. కాగా ముత్తుములకు 973 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.

News June 5, 2024

కాకినాడ పార్లమెంట్‌లో తంగెళ్ల ఉదయ్ రికార్డ్

image

కాకినాడ MP అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(జనసేన) బంపర్ మెజార్టీతో గెలిచారు. ఉదయ్‌కి 7,29,699 ఓట్లు, చలమలశెట్టి(YCP)కి 5,00,208 ఓట్లు రాగా.. 2,29,491 ఓట్ల మెజార్టీతో ఉదయ్ విజయం సాధించారు. కడియంకు చెందిన ఉదయ్ విదేశాల్లో పలు IT సంస్థల్లో పని చేశారు. 2015లో జాబ్ మానేసి ‘TEA TIME’ బిజినెస్ స్టార్ట్ చేశారు. తాజా ఫలితాల్లో కాకినాడ పార్లమెంట్‌ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో రికార్డ్ తిరగరాశారు.

News June 5, 2024

విశాఖ: కుటుంబంలో ముగ్గురూ ఓటమి

image

వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన బూడికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అనకాపల్లి MPగా పోటీ చేసి.. సీఎం రమేశ్ చేతిలో 2,96,630 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా వైసీపీ తరఫున మాడుగుల MLA బరిలో దిగిన అతని కుమార్తె ఈర్లె అనూరాధకు కూడా ఓటమి తప్పలేదు. TDP అభ్యర్థి బండారు 28,026 ఓట్ల మెజార్టీతో ఆమెపై గెలిచారు. మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అతని కుమారుడికి 395 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

News June 5, 2024

ఉమ్మడి కృష్ణాలో కూటమి క్లీన్ స్వీప్

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది MLA అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని చిన్నికి 2,82,085, బాలశౌరికి 2,16,938 మెజార్టీ వచ్చింది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి 47,032 మెజార్టీతో గెలిచారు.

News June 5, 2024

ప.గో.: పోలవరం టెన్షన్.. టెన్షన్

image

పోలవరం ఓట్ల లెక్కింపులో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలిరౌండ్లో ఆధిక్యం కనబర్చిన వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి తిరిగి 4వ రౌండులో ఆధిక్యం అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్లలో జనసేన అభ్యర్థి పోలవరం బాలరాజు జోరందుకోగా 8, 9, 10, 11 రౌండ్లలో తిరిగి వైసీపీ అభ్యర్థి ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం చేశారు. 14- 20వ రౌండ్ వరకు బాలరాజు మళ్లీ జోరు చూపి 7935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News June 5, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నోటాకు వేలల్లో ఓట్లు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు కూడా వేలల్లో ఓట్లు వచ్చాయి. పాలకొల్లులో నోటాకు 900 ఓట్లు, నరసాపురం నియోజకవర్గంలో 1,216, పోలవరంలో 5,172, చింతలపూడిలో 4,121, ఉంగుటూరులో 2,088, దెందులూరులో 1,713, ఆచంటలో 1,673, ఉండిలో 1,670, భీమవరంలో 1,210, ఏలూరులో 1,212, తణుకులో 1,722, తాడేపల్లిగూడెం 1,522 ఓట్లు నోటాకు దక్కాయి.

News June 5, 2024

విజయనగరం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య

image

అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సీతానగరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. రూరల్ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదభోగిలికి చెందిన గుజ్జల రవీంద్ర, హేమంత్ అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం వారి మధ్య గొడవ రావడంతో హేమంత్‌ని అన్న రవీంద్ర కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.

News June 5, 2024

ఫలించిన ‘శింగనమల’ సెంటిమెంట్.. ఉరవకొండ బద్దలు

image

రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.

News June 5, 2024

కర్నూలు: ముగ్గురు అన్నదమ్ముల పోటీ.. ఒక్కరే గెలుపు

image

రాంపురం సోదరులుగా పిలువబడే ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆదోని, మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నుంచి పోటీ చేసి వై.సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ అదే పార్టీ, అవే స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే గెలవగా.. వెంటకరామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు.