Andhra Pradesh

News June 5, 2024

విజయనగరం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య

image

అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సీతానగరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. రూరల్ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదభోగిలికి చెందిన గుజ్జల రవీంద్ర, హేమంత్ అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం వారి మధ్య గొడవ రావడంతో హేమంత్‌ని అన్న రవీంద్ర కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.

News June 5, 2024

ఫలించిన ‘శింగనమల’ సెంటిమెంట్.. ఉరవకొండ బద్దలు

image

రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.

News June 5, 2024

కర్నూలు: ముగ్గురు అన్నదమ్ముల పోటీ.. ఒక్కరే గెలుపు

image

రాంపురం సోదరులుగా పిలువబడే ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆదోని, మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నుంచి పోటీ చేసి వై.సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ అదే పార్టీ, అవే స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే గెలవగా.. వెంటకరామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు.

News June 5, 2024

కందుకూరును ప్రకాశంలో కలుపుతా: ఇంటూరి

image

కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?

News June 5, 2024

కడప: అతిచిన్న ఎమ్మెల్యే.. అతిపెద్ద ఎమ్మెల్యే

image

కడప జిల్లాలో కూటమి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. జిల్లాలో కూటమికి 7 స్థానాలు, YCPకి 3స్థానాలు వచ్చాయి. వీరిలో కోడూరు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ జిల్లాలో అతి చిన్న ఎమ్మెల్యే (27)గా నిలిచారు. అలాగే ప్రొద్దుటూరు TDP ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరద రాజుల రెడ్డి అత్యంత పెద్ద వయస్సుగల ఎమ్మెల్యే (82)గా నిలిచారు. ఈయన రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యంత పెద్ద వారు కావడం గమనార్హం.

News June 5, 2024

వంగా గీతకు తొలి ఓటమి ‘పిఠాపురమే’

image

వంగా గీత తొలిసారి ఓటమి చెందారు. 1983లో రాజకీయాల్లో ప్రవేశించి 1985-87 వరకు మహిళా శిశు రీజినల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1995లో కొత్తపేట ZPTCగా గెలిచారు. 1995-2000 వరకు తూ.గో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున MLAగా, 2019లో YCP నుంచి కాకినాడ MPగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పవన్‌ చేతిలో 70,279 ఓట్ల తేడాతో ఓడారు.

News June 5, 2024

జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం

image

గుమ్మనూరు జయరామ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 5, 2024

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్

image

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక్కడ గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతోంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బొర్రా వెంకట స్వామితో ప్రారంభమైన ఈ సెంటిమెంట్ తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మరింత ముందుకు తీసుకువెళ్లారు.

News June 5, 2024

ప.గో.: తండ్రి MLA.. కొడుకు MP

image

ప.గో. జిల్లా ఏలూరు MPగా పుట్టా మహేశ్ యాదవ్ తొలిసారి పోటీచేసినప్పటికీ 1,78,326 భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందారు. ఈయన 20.14, 2019లో పోటీచేసినప్పటికీ ఓటమి చవిచూశారు. తాజా గెలుపుతో తండ్రి MLAగా, కొడుకు MPగా సేవలందించనున్నారు.

News June 5, 2024

YCPకి బూస్ట్ ఇచ్చిన చిలకలూరిపేట వాసి.. చివరకు!

image

చిలకలూరిపేటకు చెందిన సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్‌తో ఏపీలోని వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. నిన్నటి ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క చోటా YCP ఖాతా తెరవలేకపోయింది. 17 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. మంగళగిరి, తదితర చోట్ల టీడీపీ గెలుస్తుందనే ఆరా మస్తాన్ అంచనా నిజం కాగా, చాలా చోట్ల ప్రతికూల ఫలితం వచ్చింది.