Andhra Pradesh

News June 5, 2024

విశాఖ మంత్రులకు రాష్ట్రంలోనే భారీ ఓటమి

image

ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు భారీ ఓటమి చవిచూశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తొలి రెండు స్థానాల్లో ఓడిన అభ్యర్థులు వీరే కావడం గమనార్హం. గాజువాకలో అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాస్‌రావు 95,235 ఓట్ల మెజారిటీతో గెలిపొందగా, అవంతిపై గంటా శ్రీనివాస్ రావు 92,401 ఓట్ల తేడాతో గెలిపొందారు.

News June 5, 2024

పల్నాడు: 60 రోజుల్లోనే MLA

image

పెదకూరపాడులో టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన తన మామ, సమీప ప్రత్యర్థి నంబూరు శంకర్రావుపై గెలిచారు. కాగా, మార్చి 15న నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 60 రోజుల్లోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. సీనియర్ నేత, టికెట్ ఆశించి భంగపడిన కొమ్మాలపాటి శ్రీధర్ సహకారం ఈయనకు కలిసొచ్చింది. పల్నాడులో తొలిసారి గెలిచిన వారిలో భాష్యం ప్రవీణ్ ఒకరు.

News June 5, 2024

కోనసీమ: సిట్టింగ్ MLAకు డిపాజిట్ దక్కలే  

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 1,526 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 1,751 ఓట్లు వచ్చాయి. దాని కన్నా తక్కువ ఓట్లు చిట్టిబాబుకు రావటం గమనార్హం. 2014లో పి.గన్నవరం నుంచి YCP అభ్యర్థిగా చిట్టిబాబు పోటీచేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.

News June 5, 2024

ఫలించిన విశాఖ పోలీసుల వ్యూహం

image

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసకాండతో ఓట్ల లెక్కింపు నిర్వహణపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీపీ రవిశంకర్ అయ్యర్ ప్రత్యేక వ్యూహంతో నగరమంతటా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందు తర్వాత నగరంలో ప్రశాంత వాతావరణ నెలకొనడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు.

News June 5, 2024

బాపట్ల ఎంపీగా కృష్ణ ప్రసాద్ విజయం

image

బాపట్ల ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్ పై, తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

News June 5, 2024

ప్రకాశం ఎమ్మెల్యేలు వీరే.. మెజార్టీ ఇదే

image

అద్దంకి – గొట్టిపాటి రవికుమార్ + 24890
దర్శి – శివ ప్రసాద్ రెడ్డి +2597
కందుకూరు – నాగేశ్వరరావు +18558
కనిగిరి – ఉగ్ర +14604
కొండపి – డోల వీరాంజనేయస్వామి +24756
మార్కాపురం – నారాయణ రెడ్డి +13979
ఒంగోలు – దామచర్ల +34026
పర్చూరు – ఏలూరి సాంబశివరావు +24013
సంతనూతలపాడు – బీఎన్ విజయ్ కుమార్ +30385
యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్ర శేఖర్ +5477
చీరాల – M.M. కొండయ్య +20984
గిద్దలూరు – అశోక్ రెడ్డి +973

News June 5, 2024

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకే సెంటిమెంట్

image

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకసారి గెలిచిన వారు మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు. 1994 నుంచి 2019 ఎన్నికల వరకు ఇదే కొనసాగింది. 2009లో ఈ స్థానం ఎస్టీలకు కేటాయించగా.. విజయరామరాజు పాతపట్నంకి మారడంతో సవరపు జయమణి గెలిచారు. 2014లో జయమణి ఎన్నికలకు దూరంగా ఉండగా.. చిరంజీవులు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ బోనెల విజయ్ చంద్ర 20వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

News June 5, 2024

DCCB ఛైర్మన్ పదవికి కామిరెడ్డి రాజీనామా

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB) ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ తన పదవికి రిజైన్ చేశారు. ఎస్సీ రిజర్వ్ అయిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక నేతగా వ్యహరించారు. జగన్‌తోనూ ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

News June 5, 2024

కర్నూలు జిల్లాలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు వీరే..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
☞ కర్నూలు – టీజీ భరత్ (టీడీపీ)
☞ పత్తికొండ – కేఈ శ్యాంబాబు (టీడీపీ)
☞ కోడుమూరు – బొగ్గుల దస్తగిరి (టీడీపీ)
☞ ఆదోని బీకే పార్థసారథి (బీజేపీ)
☞ నందికొట్కూరు – గిత్తా జయసూర్య (టీడీపీ)
☞ ఆలూరు – బుసినే విరుపాక్షి (వైసీపీ)

News June 5, 2024

కాకినాడ: ఒకే ఇంటి నుంచి ముగ్గురు MPలు

image

అమలాపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ 3,42,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బాలయోగి కుటుంబం నుంచి 3వ ఎంపీగా ఆయన చరిత్ర సృష్టించారు. హరీష్ తండ్రి బాలయోగి 1994, 1999లో అమలాపురం MPగా గెలిచారు. లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలందించారు. ఇక 2002లో ఆయన మృతి తర్వాత ఉప ఎన్నికలో సతీమణి విజయకుమారి గెలుపొందారు. 2019లో కుమారుడు హరీష్ పోటీచేసినా ఓటమి చెందారు.
➤ SHARE IT