Andhra Pradesh

News March 18, 2024

విజయనగరం : కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూమ్

image

ఎన్నికల కంట్రోల్ రూమ్‌ నుంచి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలెక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంట్లో మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మెనేజ్మెంట్ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగారు.

News March 18, 2024

స్పందన కార్యక్రమం రద్దు: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని అన్నారు.

News March 17, 2024

ప.గో: వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్.. 3Hrs టెన్షన్

image

ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి ఎట్టకేలకు కిందికి దిగాడు. వేల్పూరు గ్రామానికి చెందిన యరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను కిందకు దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3గంటల అనంతరం అతడు కిందికి దిగాడు.

News March 17, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణకు పార్టీలు సహకరించాలి

image

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, జెండాలు వంటివన్నీ తొలగిస్తున్నామన్నారు. అనంతరం ఎన్నికల నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌ను వారికి అందజేశారు.

News March 17, 2024

KNL: ఇకపై ఊపందుకోనున్న అభ్యర్థుల ప్రచార పర్వం

image

మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.

News March 17, 2024

నంద్యాల: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.

News March 17, 2024

పోలీస్ కార్యాలయంలో స్పందన రద్దు: ఎస్పీ తుషార్

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. 

News March 17, 2024

శ్రీకాకుళం: లోన్‌యాప్స్ పై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

ఫోన్‌కు వచ్చే గుర్తింపు లేని లింకులను క్లిక్ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని సైబర్ నేరాలకు గురికావద్దని ఎస్పీ రాధిక సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్‌యాప్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ కోసం యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుంచి చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.

News March 17, 2024

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News March 17, 2024

దువ్వూరు కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

సంగం మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి గుడి పక్కన ఉన్న దువ్వూరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు తరలించారు. మృతుడు సంగంకి చెందిన సూరాయిపాలెం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.