Andhra Pradesh

News March 17, 2024

కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

image

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 17, 2024

చిలకలూరిపేట టీడీపీ కూటమి సభపై YCP ట్వీట్

image

చిలకలూరిపేట టీడీపీ కూటమి సభపై YCP సెటైరికల్ ట్వీట్ చేసింది. 2014లో ఈ 3 పార్టీలు 650 హామీలు ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోను అటకెక్కించాయని పేర్కొంది. ఇప్పుడు అవే పార్టీలు అధికార దాహం కోసం ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. మళ్లీ మేనిఫెస్టోతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది.

News March 17, 2024

గుడివాడ: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అభ్యర్థిగా హేమంత్

image

రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కోరారు. ఆదివారం గుడివాడకు చెందిన న్యాయవాది అల్లూరి హేమంత్ కుమార్‌ను గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావడం ఎంతో అవసరం అన్నారు. జిల్లా కో-ఆర్డినేట‌ర్ బి.స‌త్య వ‌సుంధ‌ర‌, లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్ నాయ‌ర్, పాల్గొన్నారు.

News March 17, 2024

ఎంపీ బరిలో గూడూరు ఎమ్మెల్యే

image

తిరుపతి ఎంపీ తాను పోటీలో ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీలో ఉంటానని ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

News March 17, 2024

ప.గో. జిల్లాలో ఇరువురు మహిళలకు అవకాశం

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో YCP నుంచి ఇరువురు మహిళలకు అవకాశం దక్కింది. వీరిలో తెల్లం రాజ్యలక్ష్మి (పోలవరం), తానేటి వనిత (గోపాలపురం) ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికి అవకాశం లభించగా, ఈసారి అదనంగా మరొకరికి చోటు దక్కింది. కాగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నుంచి గూడూరి ఉమాబాలకు అవకాశం లభించింది. ఏలూరు జిల్లాలో పార్లమెంటు మహిళలకు స్థానం దక్కలేదు.

News March 17, 2024

మ 3గం.లోపు అన్ని క్లియర్ చేయండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వేళ ఈ మ.3 గం.లోపు సచివాలయాలు, RBKలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా ప్రతినిధుల చిత్రపటాలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.

News March 17, 2024

బొబ్బిలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. బొబ్బిలి గొల్లవీధికి చెందిన పార్వతి ఆదివారం ఉదయం పూల్ బాగ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

గుంటూరు: ‘ఈ వృద్ధున్ని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి’

image

ఒక వృద్ధుడు మృతి చెందిన ఘటనపై ఆదివారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాషా తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 12వ తేదీన 50 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. అతని పేరు వివరాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వృద్ధుడి గురించి తెలిసిన వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News March 17, 2024

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే.!

image

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద నేడు జరగనున్న TDP కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు PM మోదీ హజరవుతుండగా, పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ సాయంత్రం 4.10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7కు హైదరాబాద్ వెళతారు.

News March 17, 2024

అనకాపల్లి: కరెంట్ షాక్‌తో సచివాలయ ఉద్యోగి మృతి

image

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్‌ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.