Andhra Pradesh

News March 31, 2025

ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

image

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.

News March 31, 2025

వ్యక్తిగత గొడవల్ని పార్టీలకు ఆపాదించవద్దు: పరిటాల

image

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.

News March 31, 2025

గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. 

News March 31, 2025

చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

News March 31, 2025

VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా: SP

image

కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

News March 31, 2025

జలుమూరు దేవాలయ ఘటనపై SP మహేశ్వర్ రెడ్డి పరిశీలన

image

జలుమూరు మండలంలో పలు దేవాలయాలలో ఉగాది పర్వదినాన అన్యమత ప్రచారాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలలో వివిధ అన్యమత ప్రచారకులుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో జరిగిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. ఆయనతోపాటు క్రైమ్ ASP శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News March 31, 2025

మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

image

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్‌లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

News March 31, 2025

కాళ్ల: కోడి పందేలు ఆడుతున్న ముగ్గురు అరెస్ట్

image

కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు  ఎస్ఐ ఆదివారం తెలిపారు. ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ.6,100 నగదు, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.

News March 31, 2025

రాజమండ్రి: విషమంగా అంజలి ఆరోగ్య పరిస్థితి

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్‌లో వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అంజలి (23) తాజా ఆరోగ్య బులిటెన్ విడుదలైంది. 7మంది వైద్యుల కమిటీ వైద్య పరీక్షలు చేసి ఈ ఆరోగ్య నివేదికను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఆమె ఎవరినీ గుర్తించలేని, స్పందించని స్థితిలో ఉందని వారు తెలిపారు. కళ్లకి వెలుతురు చూపినా రెస్పాన్స్ రావటం లేదన్నారు. మొత్తంగా ఆమె పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.