Andhra Pradesh

News March 30, 2025

రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .

News March 30, 2025

మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

image

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

News March 30, 2025

విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

image

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2025

ఆర్యు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఆదివారం యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఉమా ఆదేశాల మేరకు విడుదల చేశారు. 1వ సెమిస్టర్‌లో 7,643 మంది పరీక్ష రాయగా 3,827 మంది ఉత్తీర్ణత సాధించారు, 3వ సెమిస్టర్‌లో 6,169 మంది పరీక్ష రాయగా 3,134 ఉత్తీర్ణత సాధించారు. 5వ సెమిస్టర్ 5,709 మంది పరీక్ష రాయగా 4,097 మంది ఉత్తీర్ణత సాధించారు. వీటితోపాటు సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశారు.

News March 30, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ

image

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

News March 30, 2025

ఒంగోలులో ఘనంగా ఉగాది వేడుకలు

image

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, MLA విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

News March 30, 2025

విశాఖ క్రికెట్ స్టేడియంలో శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌

image

విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ శిలాఫ‌లాకాన్ని మంత్రి నారా లోకేశ్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. క్రీడాలకు కూటమి ప్రభుత్వం హయాంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఉన్నారు.

News March 30, 2025

సింహాచలం అప్పన్న సన్నిధిలో పంచాంగ శ్రవణం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ వారి దేవస్థానంలో ఉగాది ఆస్థానం విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ అలంకారి శ్రీ సీతారామచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా పడతాయని, రైతులకు పంటలు సకాలంలో చేతికి అందుతాయన్నారు. అనంతరం దేవస్థానం పంచాంగాలు అందరికీ అందించారు.

News March 30, 2025

వైజాగ్ మ్యాచ్ చూసేందుకు జైషా

image

విశాఖ వేదికగా జరుగుతున్న SRH-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూసేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్టేడియానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి లోకేశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయన వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏసీఏ అధికారుల చేశారు. వచ్చే విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖలో జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

News March 30, 2025

పండగల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ సూచన

image

ఉగాది, రంజాన్ సందర్భంగా విశాఖ ప్రజలకు కలెక్టర్ ఎమ్.ఎన్ హరేంధిర ప్రసాద్ ముఖ్యమైన సూచన చేశారు. ఈ రెండు రోజుల క్లాప్ వాహనముల ద్వారా వచ్చే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. దీంతో వారు చెత్త సేకరణకు రారని తెలిపారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా పబ్లిక్ బిన్స్‌లలో వేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తగా విభజించిన అందించాలన్నారు.