Andhra Pradesh

News March 17, 2024

పశ్చిమగోదావరిలో 14.61 లక్షల ఓటర్లు

image

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,61,338 మంది ఓట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలు అత్యధికంగా 7,44,308, పురుషులు 7,16,956 మంది, థర్డ్‌ జెండర్స్‌ 74 మంది ఉన్నారు. మొత్తంగా 1,463 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

News March 17, 2024

కాకినాడ: పవన్‌కళ్యాణ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

image

చంద్రబాబు హామీతో అలక వీడిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శనివారం రాత్రి మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. మరో నాలుగు ఐదు రోజుల్లో తాను పిఠాపురం వస్తానని, తగిన ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

News March 17, 2024

ఆమదాలవలస: పదోసారి పోటీలో తమ్మినేని

image

ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో వైసీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పదో సారి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ మూడో సారి బరిలోకి దిగారు. రవికుమార్ అక్క వాణి తమ్మినేని భార్య కావడంతో.. బావ బామ్మర్దులు ఇద్దరూ పోటీ పడుతున్నారు.

News March 17, 2024

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్‌ల వైపు మొగ్గు చూపిన జగన్

image

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్ MLAలు సింహాద్రి రమేష్ (అవనిగడ్డ), వల్లభనేని వంశీ (గన్నవరం), కొడాలి నాని (గుడివాడ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కైలే అనిల్ (పామర్రు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), మేకా ప్రతాప్ అప్పారావు (నూజివీడు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)లకు వారి స్థానాల్లో పోటీ చేస్తుండగా పెడన MLA జోగి రమేశ్ పెనమలూరు, విజయవాడ పశ్చిమ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్‌లో పోటీ చేస్తున్నారు.

News March 17, 2024

నంద్యాల జిల్లాలో ఒక అభ్యర్థి మినహా.. అందరూ రెడ్డిలే

image

నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ అభ్యర్థి డా.ధారా సుధీర్(SC) మినహా మిగిలిన వారందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనర్హం. డోన్-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, BPL-కాటసాని రామిరెడ్డి, NDL-శిల్పా రవిరెడ్డి, PNM-కాటసాని రాంభూపాల్ రెడ్డి, ALG -గంగుల బ్రిజేంద్రారెడ్డి, SRLM-శిల్పా చక్రపాణి రెడ్డి MLA అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. నంద్యాల MP అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఆ సామాజికవర్గం వారే.

News March 17, 2024

10వ తరగతి విద్యార్థులకు ALL.THE.BEST: కలెక్టర్ గౌతమీ

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూ.. ALL.THE.BEST. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

News March 17, 2024

పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్‌ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News March 17, 2024

గిద్దలూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో యోగానంద స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వీరిద్దరూ పోతవరం గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు. పని నిమిత్తం గిద్దలూరు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News March 17, 2024

కడప జిల్లాలో వారిద్దరూ 9వ సారి పోటీ

image

కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులపై అందరి దృష్టి ఉంది. కారణం వారు 9వ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి. ఇద్దరికీ 40 ఏళ్ల పై చిలుకు రాజకీయ అనుభవం ఉంది. వరద 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు ఓడారు. రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచి, 4 ఓడారు. ఇప్పడు వీరిద్దరు 9వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వీరు గెలిచి చరిత్ర సృష్టిస్తారా?