India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమై ఎన్నికల నేపథ్యంలో ఆయా శాఖలు పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు. నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడంలో ముమ్మరంగా పనిచేయాలన్నారు.
ప్రకాశం జిల్లా వైసీపీలో గత, తాజా ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలినేని ఒకే ఒక్కడిగా నిలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరు సీట్లు కోల్పోవడం, ఇంకొందరు స్థానాలు మారడం జరిగింది. ఒంగోలు నుంచి బాలినేని ఒక్కరే తిరిగి సీటు దక్కించుకున్నారు. జిల్లాలోని సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, కొండపి నియోజకవర్గాలకు అందరూ కొత్తవారే.
సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున నేటి నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం స్పందన భవనంలో కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ విభాగం, సోషల్ మీడియా విభాగము, ఫిర్యాదుల పరిశీలన విభాగం, 24X7 ఫిర్యాదులు స్వీకరణ విభాగానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004256625 ఏర్పాటు చేశారు.
ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు శనివారం అనంతపురం రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రోజుల్లో హల్ టికెట్ చూపించి అన్ని పల్లెవెలుగు, అల్ట్రా సర్వీసు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన కాలువలో శనివారం మొసలి ప్రత్యక్షం అయింది. మొసలిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలువను ఆనుకునే గృహాలు ఉండటంతో చుట్టుపక్కల వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతానికి దగ్గరలోనే అధికారులు మొసలిని పట్టుకున్నారు. ఇప్పుడు మరో మొసలి ప్రత్యక్షమైంది.
రేపు చిలకలూరిపేట సభ జరగనున్న నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు ఐజి పాలరాజు తెలిపారు. చెన్నై నుంచి కలకత్తా NH-16 పై వెళ్లే వాహనాలు ఒంగోలు -దిగమర్రు NH214-Aపై రేపల్లె, మచిలీపట్నం మీదగా విశాఖపట్నం వెళ్ళాలని, నార్కెట్‌పల్లి NH36 పై హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదగా వెళ్ళాలన్నారు. NH 16పై వెళ్లే వాహనాలు విశాఖపట్నం, హనుమాన్ జం, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్ళాలన్నారు.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 MLA స్థానాలు, 2 MP స్థానాలు ఉన్నాయి. వీటిలో YCP అధిష్ఠానం ఇద్దరు మహిళా నేతలకు MLA స్థానాలను కేటాయించింది. పత్తికొండ MLA అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఇద్దరు మహిళా నేతలను YCP పోటీలో నిలిపింది.
కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.