Andhra Pradesh

News May 18, 2024

అతిసారం ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: నంద్యాల కలెక్టర్

image

ప్రజలు అతిసారం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రామతీర్థం, యర్రగుంట్ల గ్రామాల్లో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

News May 18, 2024

కౌంటింగ్‌కు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవడం లేదు: కర్నూలు కలెక్టర్

image

జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్‌కు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ విధులకు ప్రభుత్వ ఉద్యోగులు తగినంత మంది ఉన్నారని, అదనంగా సచివాలయ సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.

News May 18, 2024

ఐరన్ రాడ్ దొంగలించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

image

ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ పరిధి ఇందిరమ్మ కాలనీలో ఈ ఏడాది అక్టోబర్ 29న ఓ గదిలో భద్రపరిచిన ఐరన్ రాడ్స్ చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మణ్ బాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నేరం రుజువు కావడంతో అదే కాలనీకి చెందిన చోటే ఖాన్(25)కు 6 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు ఎక్సైజ్ కోర్ట్ జడ్జి స్పందన శుక్రవారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు.

News May 18, 2024

పోలీసు అధికార లాంఛనాలతో శ్రీశైలం కానిస్టేబుల్ అంత్యక్రియలు

image

శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో తుపాకితో కాల్చుకొని మృతిచెందిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి అంత్యక్రియలు పోలీసు అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. కర్నూల్ టౌన్ జారహాపురం కేసీ కెనాల్ దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారులు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News May 18, 2024

శ్రీకాకుళంలో విజిబుల్ పోలీసింగ్

image

మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని ముఖ్య కూడళ్లలో జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక ఆదేశాలతో ‘విజిబుల్ పోలీసింగ్’ లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు రికార్డులు పరిశీలించి, లేని వారికి జరిమానాలు విధించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.

News May 18, 2024

ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు: ఎస్పీ రఘువీర్ రెడ్డి

image

గత రెండు రోజులుగా ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు తమ విధులు నిర్వర్తించారని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చి తప్పుదోవ పట్టించే, నిరాధారమైన వ్రాతలు మానుకోవాలని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.

News May 18, 2024

సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల అధికారి

image

సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల నిల్వ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ఎన్నికల అధికారి ముఖేశ్ మీనా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యలతో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

News May 18, 2024

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కర్నూలు కలెక్టర్, ఎస్పీ

image

విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.

News May 18, 2024

నన్నయ వర్సిటీ పరిధిలో 144 సెక్షన్: మాధవీలత

image

తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన నన్నయ విశ్వవిద్యాలయం నుంచి కిలోమీటర్ మేర 144 సెక్షన్ అమలుపరచడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News May 18, 2024

తూర్పు కనుమల్లో అరుదైన కప్పను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

image

తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్టు హైదరాబాద్‌కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ దీపాపైస్వాల్ , డాక్టర్ ఎస్.ఎస్.జాదవ్, డాక్టర్ కరుతపాండి శుక్రవారం తెలిపారు. శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగిస్తున్న బ్యాక్డ్ ప్రాగ్‌గా గుర్తించామన్నారు.