Prakasam

News March 27, 2024

ఒంగోలులో భారీగా చీరలు సీజ్ 

image

ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన చీరలు,  దుస్తులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు గోడౌన్‌లో సోదాలు చేసి 1000కి పైగా చీరలు, షర్ట్‌లు, ప్యాంట్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY

image

ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భానుడి ప్రతాపానికి మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఏల్చూరులోని ఓ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చేతిపంపు నుంచి జాలువారుతున్న నీటి బిందువులను ఓ కాకి గొంతు తడుపుకుటుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అలాగే పశువుల నీరు కోసం చేతిపంపు, బోర్లు వద్ద, ఇళ్లపైన తొట్టెలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

News March 27, 2024

ప్రకాశం: 8న సాగర్‌ జలాల విడుదలకు అవకాశం

image

జిల్లాలో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేశ్ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీ సాగర్‌ జలాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు చోరీకి గురికాకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పహారాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేతి పంపుల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.

News March 27, 2024

రూ.1.79 కోట్ల నగదు స్వాధీనం: ప్రకాశం ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రూ.1,79,95,000 నగదు, 214 గ్రాముల బంగారం, 1,872 లీటర్ల అక్రమ మద్యం, 80.3 గ్రాముల మాదకద్రవ్యాలలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News March 27, 2024

బార్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేయండి: ప్రకాశం ఎస్పీ

image

జిల్లాలో సమయపాలన పాటించని బార్, రెస్టారెంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అధికారులను అదేశించారు. కోడ్ అమల్లో ఉన్నా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తుండడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్కాపురం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రెహమాన్ స్థానిక బార్ నిర్వాహకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వారిని విక్రయించుకోవాలని సూచించారు.

News March 27, 2024

ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.231

image

ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఒంగోలు-1వ పాగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం అమ్మకాలకు కొణిజేడు నుంచి 889 వేళ్లు రాగా 716 వేళ్లు అమ్ముడయ్యాయని సూపరింటెండెంట్ రవికాంత్ తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.231, కనిష్ట ధర రూ.220 పలికిందన్నారు. సరాసరి ధర రూ.228.13 వచ్చినట్లు చెప్పారు. కొనుగోలులో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News March 26, 2024

దర్శి: వీఆర్వో మృతి

image

దర్శి మండలం తూర్పువీరయ్యపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న దేసు జయప్రకాష్ (48) మంగళవారం మృతి చెందారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సంఘం నాయకులు, దర్శి మండలం వీఆర్వో ఉద్యోగులు సంతాపం తెలిపారు.

News March 26, 2024

వైపాలెం: గుండె పోటుతో గిరిజనుడు మృతి

image

యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గాంధీ నగర్ గిరిజన గూడేనికి చెందిన కుడుముల వీరన్న (33) గుండె పోటుతో మంగళవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరన్నకు గుండెల్లో నొప్పిగా ఉండడంతో ఐటీడీఏ అంబులెన్స్‌కు సమాచారం అందజేసి వీరన్నను యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.

News March 26, 2024

కందుకూరు: ఆటో, ట్రాక్టర్ ఢీ..ఒకరు మృతి

image

మోపాడు సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కందుకూరు పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా మోపాడు సమీపంలో పొగాకు చెక్కలు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో డాల లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 26, 2024

ప్రకాశం : చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు

image

చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత ఈ నెల 31న మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారని ప్రకటించగా ..తాజా షెడ్యూలు ప్రకారం చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొని అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్లో మార్కాపురం చేరుకొని సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.