Prakasam

News May 21, 2024

ప్రకాశం: రోజురోజుకు పెరుగుతున్న ధరలు

image

రోజురోజుకూ పొగాకు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒంగోలు-1 కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో రూ.312, ఒంగోలు-2, కొండపి కేంద్రాల్లో రూ.310, పొదిలిలో రూ.309, వెల్లంపల్లిలో రూ.307, టంగుటూరులో రూ.306 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఈ ఏడాది పొగాకు అమ్మకాలు మొదలు పెట్టినప్పుడు రూ.290 నుంచి మొదలైంది.

News May 20, 2024

24నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో సుభద్ర చెప్పారు. 24న తెలుగు, కాంపోజిట్ కోర్సు, 25న ద్వితీయ భాష హిందీ, 27న ఇంగ్లీషు, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయాలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, జూన్ 1న కాంపోజిట్ కోర్సు సేవం- ఓఎస్ఎన్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 3న ఓఎస్ఎన్ సీ మెయిన్ పరీక్ష జరుగుతుందన్నారు.

News May 20, 2024

కొమరోలు: 24 గంటలుగా నిలిచిపోయిన జియో సేవలు

image

కొమరోలు మండలం చింతలపల్లి గ్రామ సమీపంలోని జియో టవర్ సరిగా పనిచేయకపోవడంతో జియో సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జియో టవర్ పని చేయకపోవడం వల్ల జియో సిగ్నల్ లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి జియో టవర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

ప్రకాశం: రెండేళ్లల్లో 45 మంది మృతి

image

ఒంగోలు-కర్నూలు రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. చీమకుర్తి, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గడిచిన రెండేళ్లలో 120కి పైగా రోడ్డు ప్రమాదాలు, 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలు కూడా నడుస్తుంటాయి. ఇప్పటికే ఆ రోడ్డులో 16 బ్లాక్ స్పాట్‌లు గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆ రోడ్డు అంటే కొంతమందికి భయమే.

News May 20, 2024

కొత్తపట్నంలో దారుణ హత్య

image

గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కొత్తపట్నం మండలం రెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాంబశివ రావు వివరాల మేరకు రెడ్డిపాలెంకు చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో నాగేశ్వరమ్మ హత్యకు గురైనట్లు భావించి కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

News May 20, 2024

కనిగిరి: టీ తాగేందెకు వెళ్లి.. చనిపోయాడు

image

కనిగిరిలో ఆటో, కారు ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ ఇంకొకరు చనిపోయారు. వీరిలో కనిగిరి మున్సిపాలిటీలోని కాశీరెడ్డికాలనీకి చెందిన విష్ణునారాయణ చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. తెల్లవారుజామున టీ తాగేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని భార్య రమాదేవి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News May 20, 2024

ప్రతిభ కనబరిచిన పొదిలి విద్యార్థులు

image

ప్రకాశం జిల్లా చెస్ టోర్నమెంట్‌లో పొదిలికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం ఒంగోలు భాగ్య నగర్‌లోని జెకె రాజు చెస్ అకాడమీలో జరిగిన అండర్ 7 బాలిక, అండర్ ఓపెన్ విభాగాల్లో పొదిలి సంస్కృతి విద్యా సంస్థలకు చెందిన జె పాణ్య శ్రీవల్లి, జె విఘ్నేష్ గుప్తా, నిహల్, విహల్‌లు రజత పతకాలను సాధించారు. ఈ విద్యార్థులను పలువురు అభినందించారు.

News May 20, 2024

దాడుల ఘటనలపై 72 మంది అరెస్ట్: బాపట్ల ఎస్పీ

image

చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసి పలువురి అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కూటమి అభ్యర్థి కొండయ్య వాహనంపై దాడి ఘటనపై ఆరుగురిని, మరొక ఘటనపై ఐదుగురిని, అలాగే చీరాల వేటపాలెం మండలంలో చోటు చేసుకున్న ఘటనలపై ఐదు కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News May 19, 2024

ప్రకాశం: నెమలిగుండానికి చేరుకుంటున్న వరద నీరు

image

రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. కొద్దిరోజులుగా ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం నీటి గుండాన్ని సందర్శించేందుకు సందర్శకులు ఆలయానికి పోటెత్తారు. వేసవికాలంలో నీటి గుండానికి నీరు వచ్చి చేరుతుండడంపై సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News May 19, 2024

ప్రకాశం: రైలు పట్టాలపై మృతదేహం

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామ సమీపాన గల రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. రైలు పట్టాల మధ్య సదరు వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుడి వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.