Visakhapatnam

News April 26, 2024

పాడేరు: మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి

image

అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి సారించామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే రహదారుల నిర్మాణం, రవాణా వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. ఓటర్లంతా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 26, 2024

విశాఖ- మలేషియాకు విమాన సర్వీసులు

image

విశాఖ నుంచి మలేషియా‌కు శుక్రవారం నుంచి విమాన సర్వీస్‌‌లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి రాత్రి 10గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 4.20 గంటలకు కౌలాలంపూర్ చేరుతుంది. కార్యక్రమంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఏపీడీ ఎస్.రాజారెడ్డి, అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.కె.కుమార్ రాజా, ఓ.నరేష్ కుమార్, డీ.ఎస్.వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 26, 2024

ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

image

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేశారు.

News April 26, 2024

విశాఖ: మే 4 వరకు APPGCET దరఖాస్తు గడవు

image

రాష్ట్రవ్యాప్తంగా MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న APPGCET దరఖాస్తు గడవు మే 4వ తేదీతో ముగియనుందని కన్వీనర్ ఆచార్య జీ శశిభూషణరావు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

News April 26, 2024

విశాఖ: మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. మచిలీపట్నం- విశాఖపట్నం (17219) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి మే 26 వరకు, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి మే 27 వరకు రద్దు అయినట్లు చెప్పారు.

News April 26, 2024

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ 

image

వేసవి సెలవుల్లో పాఠశాలలు జూనియర్ కళాశాలలు తెరవద్దని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం పేర్కొన్నారు. విద్యా క్యాలెండర్ పక్కాగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, డీవీఈఓ, ఆర్ఐఓలకు ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

News April 26, 2024

భీమిలిలో అత్యధిక ఓటర్లు.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

భీమిలి నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 3,60,507 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిలో పురుషులు 1,76,860, స్త్రీలు 1,83,632,ఇతరులు 15 మంది కలరు. విస్తీర్ణంలోని పెద్దదిగా గుర్తింపు పొందింది. భీమిలితో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలు, ముఖ్యంగా మధురవాడ నియోజకవర్గంలో కలవు. ప్రముఖ సందర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

News April 26, 2024

ఈనెల 29న చోడవరంలో సీఎం జగన్ బహిరంగ సభ

image

ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.

News April 26, 2024

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను విశాఖపట్టణం లోక్ సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సాహసంతో కూడుకున్నదని జాగరూకత వహిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూ.చా పాటించాలన్నారు.

News April 25, 2024

భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరిట మరో అభ్యర్థి నామినేషన్

image

భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో మరో వ్యక్తి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జనసేన పార్టీ తరఫున గంటా శ్రీనివాస రావు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మరి పోటీలో ఉంటారా నామినేషన్ ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.