India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు.

IPL నుంచి CSK స్టార్ ప్లేయర్ ధోనీ రిటైర్ అవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆ జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీ రిటైర్మెంట్‌పై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. MS చాలా స్ట్రాంగ్. అతని రిటైర్మెంట్ గురించి ఇటీవల మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’ అని వెల్లడించారు. కాగా ధోని ఇవాళ DCతో మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

2029లోపే ‘జమిలి’ని అమలు చేస్తారనే వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామన్నారు. ‘2024 LS ఎన్నికలకు ₹లక్ష కోట్లు ఖర్చయ్యింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే GDP 1.5% వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థకు ₹4.50L Crను జోడించవచ్చు’ అని చెప్పారు.

AP: అమరావతి నిర్మాణం కోసం మిగతా నిధులను వివిధ కార్పొరేషన్ల నుంచి సమీకరించేందుకు CRDAకు అనుమతిస్తూ దానిపై సమీక్షలో CM చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ(L&T), హైకోర్టు(NCC) నిర్మాణాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అసెంబ్లీని బేస్‌మెంట్+G+3+వ్యూ పాయింట్లు+పనోరమిక్ వ్యూ, హైకోర్టు బేస్ మెంట్ + G + 7 అంతస్తుల్లో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.

7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50% పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో రెడీ చేస్తున్నామన్నారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్‌పై మాట్లాడుతూ ‘ఇది క్లిష్టమైన కథ. భారీగా ఖర్చవుతుంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. కార్తి కూడా ఉంటారు’ అని చెప్పారు.

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్‌మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‌సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి లెజెండరీ క్రికెటర్లతో సమావేశమయ్యారు. 1996 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులైన జయసూర్య, అరవింద డిసిల్వా సహా పలువురు ప్లేయర్లతో ముచ్చటించారు. అలాగే 1987-90 మధ్య శ్రీలంక శాంతి, సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(IPKF) స్మారకం(కొలంబో) వద్ద నివాళులర్పించారు. ఆ సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ట్వీట్ చేశారు.

ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న పన్నులను చూసి భారత్ నేర్చుకోవాలని SP అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవాలంటే దిగుమతులపై అధిక పన్నులు వేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పేదల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. గోరఖ్‌పూర్, అయోధ్యలో ఉన్న వక్ఫ్ భూములను కాజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

TG: గచ్చిబౌలి కంచ భూముల అంశంపై కమిటీ వేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలతో కూడిన ఈ కమిటీ అందరి వాదనలు పూర్తిస్థాయిలో వింటుందని చెప్పారు. భూములపై ఏం చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామని, ఎవరికీ నష్టం కలగకుండా వివాదం పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల లేఖలు, ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని ఆమె చెప్పారు.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి(72) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఘంటసాలకు ఇద్దరు భార్యలు కాగా సరళతో ఆయనకు జన్మించిన కొడుకే రవి. ఆయన భార్య పార్వతి భరతనాట్య కళాకారిణి.
Sorry, no posts matched your criteria.