news

News April 5, 2025

రోజా రూ.119 కోట్లు దోచేశారు: రవి నాయుడు

image

AP: మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమని శాప్ ఛైర్మన్ రవినాయుడు చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమె క్రీడాకారులకు చెందిన రూ.119 కోట్లను దోచేశారని ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. చెన్నైలో ఉండే రోజాకు ప్రస్తుతం ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.

News April 5, 2025

రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చింది.. ప్రభుత్వంపై KCR ఫైర్

image

TG: HCU భూముల ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని, దాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు చేతగావడం లేదని మండిపడ్డారు. HCU అంశంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో HCU విద్యార్థులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.

News April 5, 2025

ఒక డాలర్ =10.43L ఇరాన్ రియాల్స్‌

image

చరిత్రలోనే అత్యల్ప స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనమైంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 10.43 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. 2015లో దీని విలువ డాలర్‌కు 32వేల రియాల్స్ ఉండేవి. అయితే అణ్వస్త్ర కార్యక్రమాలతో అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా గొడవల కారణంగా కరెన్సీ విలువ పతనమవుతూ వస్తోంది. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కరెన్సీ మారక మార్కెట్లు మూతపడ్డాయి.

News April 5, 2025

సన్నబియ్యం కేంద్రానివే: కిషన్ రెడ్డి

image

TG: రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘6KGల బియ్యంలో 5KGలు PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం కిలో బియ్యానికి రూ.37.52ల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే ఐదుగురున్న కుటుంబానికి నెలకు రూ.938ల సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం కింద 2కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.

News April 5, 2025

ఏఐ ప్రజాస్వామ్యానికే పెను సవాల్ విసిరింది: సీఎం రేవంత్

image

TG: కంచ గచ్చిబౌలి వ్యవహారంలో AIని ఉపయోగించి వివాదం సృష్టించారని CM రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIతో నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించారు. వాటినే సెలబ్రిటీలు రీపోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం పంపారు. ఈ వివాదం ప్రజాస్వామ్యానికే పెను సవాలు విసిరింది. దేశ సరిహద్దుల్లో ఘర్షణ జరుగుతోందంటూ ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది’ అని అన్నారు.

News April 5, 2025

SBI PO ఫలితాలు విడుదల

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, DOB, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 5, 2025

శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

image

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News April 5, 2025

బతికుండగానే మరణాన్ని ప్రకటించుకున్న యువకుడు!

image

ఉద్యోగ వేటలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ మూడేళ్లుగా ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చనిపోయినట్లు సంస్మరణ ఫొటోను లింక్డిన్‌లో పోస్ట్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను వివరించగా.. చాలా మంది ఉద్యోగ అవకాశాల గురించి కామెంట్స్ చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు.

News April 5, 2025

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం సమీక్ష

image

TG: కంచ గచ్చిబౌలి భూముల కోర్టు కేసులు, ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆ భూముల్లో గత 25ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వణ్యప్రాణులు, పర్యావరణం వంటి వివాదాలు రాలేదని వారు CMకు వివరించారు. AI ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని తెలిపారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, వీడియోలపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు CM సూచించారు.

News April 5, 2025

IPL: టాస్ గెలిచిన పంజాబ్

image

చండీగఢ్ వేదికగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

RR: జైస్వాల్, సంజూ(C), నితీశ్, రియాన్, జురెల్, హెట్‌మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ,యుధ్‌వీర్, సందీప్ శర్మ
PBKS: ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్(C), స్టొయినిస్, వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్, సూర్యాంశ్, జాన్‌సెన్, అర్ష్‌దీప్, ఫెర్గ్యూసన్, చాహల్