India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సీజనల్ ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను నియంత్రిస్తాయి. వీటిని తినటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మగవారిలో శృంగార సామర్థ్యానికి దోహదపడతాయి. వీటిలో ఉండే జింక్ ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేలా సహకరిస్తుంది.

మోహన్‌లాల్ నటించిన L2 ఎంపురాన్ డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2022లో ఆయన నటించి, సహ నిర్మాతగా వ్యహరించిన 3 సినిమాల వల్ల పొందిన ఆదాయ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈనెల 29 వరకు సుకుమారన్‌కు గడువు విధించింది. కాగా 2022లోనూ పృథ్వీరాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మరోవైపు నిన్న ఎంపురాన్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది.

కొత్త దర్శకుడు మురళీ కిషోర్, అక్కినేని అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి అప్డేట్ రానున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అఖిల్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అఖిల్ చివరి చిత్రం ‘ఏజెంట్’ రిలీజై రెండేళ్లు కావొస్తోంది.

అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ పొరపాటున వచ్చిన ఓ మెయిల్ ఉక్రెయిన్ పౌరులను కంగుతినేలా చేసింది. ‘USAలో తాత్కాలిక నివాసానికి కల్పించిన పెరోల్‌ను రద్దు చేస్తున్నాం. 7రోజుల్లోగా దేశాన్ని విడిచివెళ్లాలి’ అనేది దాని సారాంశం. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ మెయిల్ పొరపాటున వెళ్లిందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

AP: NTR జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల పర్యటనలో భాగంగా బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని CM చంద్రబాబు సందర్శించారు. పాఠశాల మొత్తం కలియతిరిగిన ఆయన వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా? అని విద్యార్థులను ఆరా తీశారు. మెనూ ప్రకారం ఫుడ్ అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో ChatGPT దుర్వినియోగానికి గురవుతోంది. దీనితో ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను సైతం నకిలీ చేస్తున్నారు. రియలిస్టిక్ ఆధార్ & పాన్ కార్డులు, పాస్‌పోర్ట్, ఓటరు IDలను ఇది రూపొందించింది. అందించిన వివరాలతో ChatGPT చేసిన కార్డులు నకిలీవని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్ కార్డును కూడా ఇది నకిలీ చేసింది.

‘ఛావా’ సినిమాలో విలనిజంతో ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో రానున్న ‘మహాకాళి’ సినిమాలో ఆయన నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అక్షయ్ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిపాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

TG: రేషన్ షాపుల్లో ఇస్తున్నది మోదీ బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందులో కేంద్రం వాటానే ఎక్కువని, అందుకే షాపుల్లో మోదీ ఫొటోను పెట్టాలని డిమాండ్ చేశారు. మండలాలు, గ్రామల వారీగా లబ్ధిదారుల ఇంటి వద్ద భోజనాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు కంచ భూములను ఉద్దేశించి కాంగ్రెస్, BRS వంతుల వారీగా భూములను అమ్ముకుంటే రాబోయే పాలకులకు గజం కూడా మిగలదని అన్నారు.

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.5000 తగ్గడంతో కేజీ రూ.1,03,000కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.

AP: విశాఖలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హరీన్‌ధీర ప్రకటించారు. 2 వారాల సమయం ఇచ్చి, వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చిత్ర పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం 34 ఎకరాలకు పైగా భూమి కేటాయించామని, 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని వారు ప్రతిపాదించారని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు హరీన్‌ధీర వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.