India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPLలో 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతోంది. పొలార్డ్ లాంటి ఫినిషర్ లేకపోవడమూ దీనికి కారణమని ఫ్యాన్స్ అంటున్నారు. 2012 నుంచి 2021 వరకు ఎన్నో మ్యాచుల్లో MIకి ఆయన విజయాలు అందించారు. టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఫామ్ కోల్పోయి రిటైర్ అయ్యారు. ఆ తర్వాతి నుంచి MIకి సరైన ఫినిషర్ దొరకట్లేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?

AP: ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. NTR జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి రోజుల్లో సెల్‌ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని, అనేక సేవలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

TG: కేంద్రం చేపట్టిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 86 మంది ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. లొంగి పోయిన మావోయిస్టులకు ఐజీ నజరానాను అందజేశారు. కాగా దేశంలో ఈ ఏడాది చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో 300 మందికిపైగా మావోయిస్టులు మరణించారు.

మణిపుర్‌లో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఢిల్లీలో కుకీ, మైతేయి వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రెండు తెగల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఆ రాష్ట్రంలో శాంతిని తిరిగి నెలకొల్పుతామని ఇటీవల పార్లమెంటులో అమిత్ షా ప్రకటించారు. మైతేయిలకు ST హోదా కల్పించొద్దని కుకీలు ఆందోళన చేయడం అక్కడ హింసాత్మక ఘటనలకు కారణమైన సంగతి తెలిసిందే.

UPI సేవల్లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు SBI ప్రకటన విడుదల చేసింది. దీని కారణంగా వినియోగదారులకు UPI సేవల్లో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని SBI వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE వాడాలని సూచించింది. మీకూ ఈ సమస్య ఎదురైందా? COMMENT

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ MP హర్ష కుమార్‌పై తూ.గో.(D) రాజానగరం పోలీసులు BNS సెక్షన్లు 196, 197 కింద FIR నమోదు చేశారు. ప్రవీణ్‌ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.

ఓ అభిమాని పంపిన కాంచీపురం సిల్క్ చీరను ఉద్దేశించి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన బాలీవుడ్ అవార్డుల కన్నా అద్భుతమైన చీర ఎంతో బెటర్ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కంగన తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను మెచ్చి ఓ వ్యక్తి ఈ చీరను పంపడం గమనార్హం. జనవరి 17న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచినా ఓటీటీలో మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్‌గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే అని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ పదవిని మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, BRS తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

వక్ఫ్ సవరణ బిల్లు తర్వాత RSS దృష్టి క్రిస్టియన్ ఆస్తులపై పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ముస్లింలే లక్ష్యంగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రం తర్వాత ఇతర మతాలనూ టార్గెట్ చేస్తుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో 7కోట్ల హెక్టార్లలో క్యాథలిక్ చర్చిలు ఉన్నాయని RSS సంబంధిత పోర్టల్ ప్రచురించినట్లు తెలిపారు. రాజ్యాంగం మాత్రమే ఇలాంటి దాడుల నుంచి ప్రజలను కాపాడగలదని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.