India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

UPలోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ(36) అనే మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఛైత్ర నవరాత్రి పూజకు ముందు రోజు ఆమె కావాల్సిన సామగ్రి తెప్పించుకున్నారు. కానీ పీరియడ్స్ రావడంతో పూజ చేసుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి సూసైడ్‌కు పాల్పడ్డారు. పీరియడ్స్ అనేది ప్రతి నెలా సహజంగా జరిగేదేనని తాను నచ్చజెప్పినా సోనీ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు.

మోకాలి గాయంతో నిన్న LSG మ్యాచుకు దూరమైన MI బ్యాటర్ రోహిత్ శర్మ తర్వాతి మ్యాచులోనూ ఆడే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రాక్టీస్ సమయంలో ఆయన బ్యాటింగ్ చేయలేకపోయారని, మోకాలిపై బరువు మోపలేకపోతున్నారని కోచ్ జయవర్ధనే తెలిపారు. కోలుకునేందుకు ఆయనకు మరింత టైమ్ ఇస్తామన్నారు. ఎల్లుండిలోగా ఆయన కోలుకుంటే RCBతో మ్యాచులో ఆడతారని, లేదంటే ఈనెల 13న జరిగే DC మ్యాచుకు అందుబాటులోకి వస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి.

LSG బౌలర్ దిగ్వేశ్ రాఠీకి BCCI మళ్లీ <<15965200>>ఫైన్<<>> విధించింది. నిన్న MIతో మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతర మరోసారి ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్ చేసుకోవడంతో <<15965793>>మ్యాచ్ ఫీజు<<>>లో 50% కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది. దిగ్వేశ్‌కు ఇలా ఫైన్ పడుతుండటంతో సీజన్ చివరకు వేలంలో వచ్చిన డబ్బు ఫైన్లు కట్టడానికే సరిపోతుందని మీమ్స్ పేలుతున్నాయి. మరోవైపు కెప్టెన్ పంత్‌కూ స్లోఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.

TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి HYD రాజేంద్ర నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో వీరరాఘవను మొయినాబాద్ పోలీసులు ఫిబ్రవరి 8న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఇతను హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.

టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ మాడీ హామిల్టన్‌తో కనిపించారు. వీరిద్దరితోపాటు ఆమె సోదరుడు దిగిన ఫొటోను జైస్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. మాడీతో జైస్వాల్ మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు టాక్. జైస్వాల్ ఎక్కడ మ్యాచ్ ఆడినా ఆమె అక్కడ ప్రత్యక్షమవుతుంటుంది. వీరిద్దరూ కలిసి చాలాసార్లు పలు చోట్ల దర్శనమిచ్చారు. కాగా జైస్వాల్ ప్రస్తుతం RRకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

AP: గుంటూరు, విజయవాడలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై మైనార్టీలు నిరసన తెలిపారని YCP ట్వీట్ చేసింది. ‘గుంటూరు, విజయవాడలో మా పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీలు నిర్వహించారు. బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబూ ఇంత మోసం చేస్తావా? ముస్లిం సమాజం ఇక నిన్ను క్షమించదు’ అని పేర్కొంది.

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ <<15997275>>భద్రాచలం పర్యటనకు<<>> భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రద్దు చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ భద్రాచలం వెళ్లాల్సి ఉంది.

TG: శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు మూసేయాలని HYD రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్బులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని విధిగా పాటించాలని కోరింది.

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయం చర్చనీయాంశమైన వేళ కోచ్ జయవర్దనే స్పందించారు. ‘సూర్య ఔట్ అయినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్ రన్స్ చేస్తాడని చివరి ఓవర్ల వరకు వేచి చూశాం. కానీ, అతను బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు కొత్త బ్యాటర్ అవసరమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అది వ్యూహాత్మక నిర్ణయం’ అని అన్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.
Sorry, no posts matched your criteria.