India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.

AP: రాష్ట్రంలో మెగా DSC నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. SC వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. ఆ తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ముందుగా చెప్పినట్లే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్టలో నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, రేపు ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. ఈ నెల 11న రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత పెరుగుతుందని, ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘బిల్లు పాసైనంత మాత్రాన మేం ఏ మసీదును, శ్మశానవాటికను తాకబోం. బోర్డుకు సంబంధించిన అంశాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో చూడవచ్చు. నిజానికి వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు. అది చట్టం ద్వారా ఏర్పడింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. మార్చి 24న పెళ్లి జరగ్గా, మరుసటి రోజే వాటితో పరారైంది. శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే 3పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని తెలిసింది.

బాబు జగ్జీవన్ రాం బిహార్‌లోని చంద్వాలో 1908లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా పని చేశారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. నేడు జగ్జీవన్ రాం 117వ జయంతి.

వీకెండ్ రాగానే చాలామంది రెస్టారెంట్లు, మద్యం, సినిమాలు అంటూ గడిపేస్తారు. కానీ వారాంతాల్లో తగినంత సమయం కుటుంబం, ఫ్రెండ్స్, సన్నిహితులతో సరదాగా గడపాలని నిపుణులు చెబుతున్నారు. మీకు నచ్చిన పుస్తకాలు చదవాలి. ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఆడాలి. భాగస్వామికి ఇంటి పనిలో సహాయం చేయాలి. ఇంట్లో పిల్లలుంటే సరదాగా గడపాలి. హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. ఇలా చేస్తే ఫ్రెష్‌గా సోమవారం ఆఫీస్‌కు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు.

AP: పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు తన రక్తంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. దువ్వకు చెందిన ఇంటర్ విద్యార్థి హరిచరణ్ ఇటీవల రక్తదానం చేశారు. అందులో నుంచి కొంత రక్తంతో పవన్ చిత్రాన్ని గీశారు. దీనిని రాజమండ్రిలో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ చిత్రం చూసినవారు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు రక్తంతో చిత్రం గీయడం ఏంటని విమర్శిస్తున్నారు.

TG: 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం వీరిని నియమించనుంది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు రూ.33,800 వేతనం ఉంటుంది. ఈనెల 11లోగా <

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో HYDలో ఆఫీస్ లీజింగ్ భారీగా తగ్గిందని KTR తెలిపారు. 2024తో పోలిస్తే 41% తగ్గినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ‘కొలియర్స్ ఇండియా’ ఇచ్చిన నివేదికను షేర్ చేశారు. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణేలో గణనీయమైన వృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. కొత్త IT పార్కుల ఏర్పాటుకు ప్లాన్ చేసేముందు CM రేవంత్ ఈ విషయాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.