news

News April 4, 2025

బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.

News April 4, 2025

MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

image

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.

News April 4, 2025

బీజేపీ అధ్యక్ష రేసులో లేను: అన్నామలై

image

TN BJP అధ్యక్ష రేసులో తాను లేనని ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ అన్నామలై స్పష్టం చేశారు. ‘పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలున్నారు. వారి నుంచే నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇక.. వచ్చే ఏడాది ఎన్నికల్లో BJP ఒంటరిగా బరిలోకి దిగాలని అన్నామలై యోచిస్తుండగా ఆ పార్టీ AIADMKతో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది.

News April 4, 2025

బియ్యపు గింజ కంటే చిన్నదైన పేస్‌మేకర్

image

ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్‌మేకర్‌ను నార్త్‌వెస్ట్రన్ వర్సిటీ(US) సైంటిస్టులు రూపొందించారు. ఇది 1.8mm వెడల్పు, 3.5mm పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది అన్ని సైజుల గుండెలకు పనిచేస్తుంది. అయితే గుండె జబ్బులతో జన్మించిన పిల్లలకు బాగా సూటవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఆపరేషన్ల సమయంలో టెంపరరీ పేస్‌మేకర్ కీలక పాత్ర పోషిస్తుందని, సైజ్ కూడా కీలకమేనని పేర్కొంటున్నారు.

News April 4, 2025

గ్రూప్1 నియామకాలపై కేసుల కొట్టివేత

image

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలిచే అవకాశముంది.

News April 4, 2025

GOLD: ది సిల్వర్ జూబిలీ స్టోరీ

image

మిలీనియమ్ ఇయర్ 2000లో భారత్‌లో 10 గ్రా. బంగారం సగటు ధర ₹4,400. తర్వాతి ఐదేళ్లలో ₹3వేలే పెరిగింది. ఆ తర్వాతి మూడేళ్లకు 2008లో ప్రపంచ మాంద్యంతో ₹13వేలకి చేరింది. 2018లో ₹30వేలు, 2020లో ₹50వేలు దాటింది. 2021లో ₹48వేలకు తగ్గినా 2022లో పెరిగి ₹55వేలకు వెళ్లింది. 2023లో ₹63వేలు, 2024లో ₹78వేలు పలికిన పసిడి ఇప్పుడు ₹90వేలపై కూర్చుంది. ఈ ఏడాది చివరికి లక్షకు చేరడం ఖాయమట. ఇది గోల్డ్ సిల్వర్ జూబిలీ కథ.

News April 4, 2025

ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు: సీఎం

image

AP: పరిశ్రమల తరహాలోనే ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు ఇస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. PHC, CHCలలో వర్చువల్ వైద్య సేవలు అందించాలి. 13 డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.

News April 4, 2025

చరిత్ర సృష్టించిన ‘L2: ఎంపురాన్’ మూవీ

image

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ₹100Cr షేర్ కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిచినట్లు మోహన్‌లాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మార్చి 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు ₹240Cr గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. పన్నులు, థియేటర్ రెంట్, మెయింటెన్స్, ఇతర అన్ని ఖర్చులు తీసేయగా మిగిలేవి షేర్ కలెక్షన్లు.

News April 4, 2025

‘వక్ఫ్ సవరణ’పై సుప్రీం కోర్టులో ఒవైసీ పిటిషన్

image

వక్ఫ్ సవరణ బిల్లుపై ఎంఐఎం అధినేత ఒవైసీ, కాంగ్రెస్ MP మహమ్మద్ జావేద్ విడివిడిగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ బిల్లు ముస్లిం వర్గాలపై వివక్ష చూపించేలా ఉందని, వారి ఆస్తుల్ని లాక్కునేలా ఉందని ఓవైసీ ఆరోపించారు. ‘ఆ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోంది’ అని జావేద్ పేర్కొన్నారు. ఉభయ సభలూ పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఇవి తొలి రెండు పిటిషన్లు కావడం గమనార్హం.

News April 4, 2025

గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

image

TG: కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.