news

News April 4, 2025

నాగాంజలి ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

image

AP: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని <<15986707>>నాగాంజలి ఆత్మహత్య<<>> కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను మోసం చేసినట్లు ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ‘నాగాంజలిని దీపక్ లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత చస్తే చావు.. పెళ్లి మాత్రం చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.

News April 4, 2025

SRH ఇక పుంజుకోవడం కష్టం: కైఫ్

image

SRH ఆటపై మాజీ క్రికెటర్ కైఫ్ విమర్శలు గుప్పించారు. ‘ఆ జట్టు బ్యాటింగ్ క్లిక్ అవడం లేదు. బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. కెప్టెన్సీ మరీ దారుణంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు నిన్న అద్భుతంగా వేసినా వారికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఆ జట్టుపై ఉన్న అంచనాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అభిషేక్, ట్రావిస్‌ వీక్‌నెస్ బౌలర్లు కనిపెట్టేశారు. వరుసగా 3 మ్యాచులు ఓడిన ఆ టీమ్ ఇక పుంజుకోవడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

News April 4, 2025

పిల్లలతో RCB ప్లేయర్ల సెల్ఫీలు.. వైరల్

image

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లతో RCB ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, పడిక్కల్ సెల్ఫీలు దిగారు. వారితో సరదాగా మాట్లాడి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తమ ఆరాధ్య క్రికెటర్లతో ఫొటోలు దిగడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పైన ఫొటోలు చూడొచ్చు.

News April 4, 2025

జింక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసంతో ఒక వన్యప్రాణి బలైందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ HCUలోని అడవిని నరికించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిందన్నారు. చెట్లను తొలగించడంతో ఎటు వెళ్లాలో తెలియక జింక వర్సిటీ పరిధిలోకి వచ్చిందని తద్వారా కుక్కల దాడిలో మృతి చెందిందన్నారు. ఒక వన్య ప్రాణి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

News April 4, 2025

అమెరికాతో చైనా టారిఫ్ వార్.. 34శాతం సుంకం విధింపు

image

అమెరికా టారిఫ్‌లపై చైనా అన్నంత పని చేసింది. US ఉత్పత్తులపై 34శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్‌లు పెంచిన అమెరికా చైనా పైనా 34శాతం సుంకం విధించింది. దీనిపై ఘాటుగా స్పందించిన డ్రాగన్ దేశం టారిఫ్ తగ్గించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. కానీ అమెరికా దీనిపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతీకారంగా చైనా 34శాతం సుంకం విధించింది.

నాగాంజలి మృతి.. కుటుంబానికి అండగా ఉంటామన్న పవన్

image

AP: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి <<15986707>>ఆత్మహత్యపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది దురదృష్టకరమని, యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆమె సూసైడ్ నోట్ మేరకు ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.