news

News April 4, 2025

SRH కెప్టెన్ కమిన్స్ చెత్త రికార్డ్

image

SRH కెప్టెన్ కమిన్స్ IPL చరిత్రలో ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. నిన్న KKR మ్యాచ్‌తో సహా 7సార్లు 50+ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్‌శర్మతో పాటు టాప్‌లో నిలిచారు. మరోవైపు, ఈ లిస్టులో సునీల్ నరైన్ చిట్టచివర ఉన్నారు. 14ఏళ్లుగా లీగ్ ఆడుతూ ఒక్కసారి కూడా 50+ రన్స్ ఇవ్వలేదంటే ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లుగా అతని బౌలింగ్‌ను డీకోడ్ చేయలేకపోవడం గొప్ప విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.

News April 4, 2025

అకాల వర్షాలు.. రైతులకు కడగండ్లు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు నాశనమయ్యాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు ఇది పెద్ద దెబ్బే. కూరగాయలతోపాటు మామిడి, అరటి తదితర ఉద్యానవన పంటలు నేలకూలాయి. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News April 4, 2025

‘స్క్విడ్ గేమ్’ నటుడికి జైలుశిక్ష

image

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’తో పాపులరైన సౌత్ కొరియన్ నటుడు ఓ యోంగ్ సు(80)కు కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. ఓ జూనియర్ ఆర్టిస్టును అతడు లైంగికంగా వేధించడమే ఇందుకు కారణం. అయితే ఇందులో తన తప్పు లేదని యోంగ్ సు కోర్టులో చెప్పారు. కానీ ఇరుపక్షాల వాదనలు విని, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 50 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు.

News April 4, 2025

కాసేపట్లో వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

News April 4, 2025

ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా HC

image

పేరెంట్స్‌లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.

News April 4, 2025

వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా

image

పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పాస్ అవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Xలో స్పందించారు. ఇక అవినీతి, అన్యాయం అంతమైనట్లేనని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు న్యాయం, సమానత్వానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేదలు, మహిళలు, పిల్లలకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉభయ సభల్లో బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News April 4, 2025

ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపన్యాసంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఇవాళ్టి వరకు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

News April 4, 2025

మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్ రావు

image

TG: HCU భూముల విషయంలో నిలదీసినందుకు విద్యార్థులు, BRS నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని BRS MLA హరీశ్ మండిపడ్డారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇలా ఎంత మందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? మీ పిట్ట బెదిరింపులకు భయపడం’ అని ట్వీట్ చేశారు.

News April 4, 2025

మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

News April 4, 2025

మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.