news

News April 3, 2025

ఎయిర్‌ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

image

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్‌ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.

News April 3, 2025

BREAKING: SRHతో మ్యాచ్.. KKR భారీ స్కోర్

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో KKR 200/6 స్కోర్ చేసింది. డికాక్(1), నరైన్(7) విఫలమవగా రఘువంశీ 50, రహానే 38, చివర్లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60, రింకూ సింగ్ 17 బంతుల్లో 32* అదరగొట్టారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

News April 3, 2025

డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

image

పెళ్లి, డేటింగ్‌ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.

News April 3, 2025

ఇతడి కోసమే ముగ్గురు పిల్లల్ని చంపేసింది!

image

TG: ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా <<15966011>>హత్య<<>> చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది. అయితే పిల్లలు లేకుంటేనే చేసుకుంటానని అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది.

News April 3, 2025

నాపై గృహ హింస కేసు కొట్టేయండి: హన్సిక పిటిషన్

image

తనతోపాటు తల్లిపై నమోదైన <<15080954>>గృహ హింస కేసును<<>> కొట్టేయాలంటూ హీరోయిన్ హన్సిక బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. అత్లింట్లో తనను వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు ₹20L, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని హీరోయిన్ డిమాండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 3, 2025

మరో వివాదంలో నిత్యానంద!

image

సజీవ సమాధి అయ్యారంటూ వార్తల్లో నిలిచిన <<15965534>>నిత్యానంద<<>> మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈక్వెడార్ సమీపంలో ‘కైలాస’ దేశం ఏర్పాటుచేసుకున్న ఆయన కన్ను బొలీవియాపై పడినట్లు సమాచారం. నిత్యానంద అనుచరులు 20మంది $2లక్షలకు ఓ ప్రాంతాన్ని 25ఏళ్ల లీజుకు తీసుకునేందుకు స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు. వెయ్యేళ్ల లీజుకు ప్రయత్నించగా విషయం బయటికొచ్చింది. దీంతో GOVT వారిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు(IND, చైనా, US) పంపింది.

News April 3, 2025

JEE అడ్మిట్ కార్డులు విడుదల

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈనెల 7,8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో NTA ఎగ్జామ్స్ నిర్వహించనుంది.

News April 3, 2025

రూ.251తో 251 GB

image

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు BSNL శుభవార్త చెప్పింది. ప్రీపెయిడ్ యూజర్లకు రూ.251తో స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. యాక్టీవ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 60 రోజుల కాలపరిమితితో 251 GBని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత కూడా 40Kbps స్పీడ్‌తో నెట్ వాడుకోవచ్చు.

News April 3, 2025

రికార్డుస్థాయి వర్షపాతం

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో సరూర్ నగర్‌, హిమాయత్ నగర్‌లో 84.8mm, చార్మినార్ 84mm, ముషీరాబాద్‌లో 80.5mm వర్షపాతం నమోదైంది. దాదాపు అన్నిచోట్ల 66mm పైనే వాన కురిసింది. ఏప్రిల్‌లో ఈస్థాయి వర్షం పడటం ఇదే తొలిసారని తెలుస్తోంది. కాగా అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News April 3, 2025

ఎల్లుండి విద్యార్థుల తల్లిదండ్రుల మహా ధర్నా!

image

CBSE పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో ధర్నా చౌక్ వద్ద ఎల్లుండి మహా ధర్నా చేపట్టనున్నారు. ‘ఈ నిర్ణయంతో బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దశలవారీగా తెలుగును మూడో భాషగా ప్రవేశపెట్టాలి. సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.