news

News April 3, 2025

నార్త్ సెంటినల్‌ ఐలాండ్‌లోకి US వ్యక్తి.. అరెస్ట్

image

అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవిలోకి ఎంటరైన US వ్యక్తి పోల్యకోవ్ (24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతడు అక్కడి గిరిజనులు కంటికి చిక్కలేదు. తిరిగి వచ్చే సమయంలో ఓ మత్స్యకారుడు చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ధలివాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా సెంటినల్ దీవుల్లోకి ఎవరైనా వెళ్తే అక్కడి గిరిజనులు చంపేస్తారు. భారత ప్రభుత్వం దాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించింది.

News April 3, 2025

RCBని దెబ్బకొట్టిన సిరాజ్

image

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.

News April 3, 2025

మరో దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్: KTR

image

TG: కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని సీఎం రేవంత్ మరోసారి నిరూపించారని KTR దుయ్యబట్టారు. ఉచిత LRS అని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే రూ.1,400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఖజానా నింపుకునేందుకు గడుపు పెంచి మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హామీని మరచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న CONG సర్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

News April 3, 2025

శ్రీవారి భక్తుల కోసం బేస్ క్యాంప్!

image

AP: రద్దీ సమయాల్లో తిరుమల శ్రీవారి భక్తులు ఇబ్బంది పడకుండా అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మించాలని TTD భావిస్తోంది. ప్రస్తుతం తిరుమలలో 55వేల మందిని సర్దుబాటు చేస్తున్నారు. ఆ సంఖ్య పెరిగితే ఈ క్యాంప్ అవసరమవుతుందని CM చంద్రబాబు దృష్టికి TTD తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే కొండపై పార్కింగ్ సమస్య తీరి కాలుష్యం తగ్గుతుంది. నీరు, మురుగునీటి వ్యవస్థ మెరుగవుతుంది.

News April 3, 2025

రూమర్స్‌పై ‘ది ప్యారడైజ్‌’ టీమ్ ఆగ్రహం

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌తోనే సంచలనం సృష్టించింది. అయితే ఫండింగ్ సమస్య, స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై మూవీ టీమ్ ‘గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి’ అంటూ ఘాటుగా స్పందించింది. ‘మూవీ రైట్ ట్రాక్‌లో ఉంది. TFIలో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్వీట్ చేసింది.

News April 3, 2025

సాయి సుదర్శన్ పరుగుల ప్రవాహం.. ఓ లుక్కేయండి!

image

35, 11, 20, 65*, 14, 22, 62*, 53, 19, 20, 47, 43, 96, 45, 37, 45, 33, 31, 35, 12, 31, 65, 84*, 6, 103, 74, 63, 49.. GT ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు ఇవి. IPLలో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు(1220) చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను.. 2022లో GT ట్రోఫీ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు.

News April 3, 2025

మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

image

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.

News April 3, 2025

అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం

image

AP: నిన్న ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్‌మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు.

News April 3, 2025

‘ఉప్పల్’కు బీసీసీఐ నో ఛాన్స్

image

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు చూసింది. ఈ ఏడాది ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహణకు మొగ్గు చూపలేదు. నిన్న విడుదల చేసిన వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌ల షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి SAతో మూడో వన్డేకు విశాఖపట్నం మాత్రమే ఆతిథ్యమివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ్యాచులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News April 3, 2025

స్టాక్ మార్కెట్స్‌పై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్

image

US ప్రెసిడెంట్ ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం ఏషియా మార్కెట్స్‌పై తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న లాభాల్లో ముగిసిన భారత సూచీలు ఇవాళ భారీ నష్టాలను చవిచూడొచ్చని భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. కాగా భారత్, చైనా, కెనడా సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు.