India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కరాచీలోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. జర్దారీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణకు ముందు ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

RCBతో మ్యాచులో టాస్ గెలిచిన GT బౌలింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్(C), లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
GT: గిల్(C), బట్లర్, సుదర్శన్, ఇషాంత్ శర్మ, షారుఖ్ ఖాన్, తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, అర్షద్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న నటి రన్యారావుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో వివాహ బంధానికి ముగింపు పలికేందుకు భర్త జతిన్ సిద్ధమయ్యారు. ఈమేరకు కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆమెతో పెళ్లైన నాటి నుంచి ఏదో ఒక వివాదం కారణంగా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన చెప్పారు. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్ కోసం రన్యారావు బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కాం కేసులో ED ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కర్ణాటక CM సిద్దరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ సవాల్ చేసింది. ఇందులో ఆయన హస్తం ఉందనడానికి తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ కుంభకోణంలో సిద్దరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉందని గతంలో ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

‘మ్యాడ్ స్క్వేర్’తో విజయం అందుకున్న సంగీత్ శోభన్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్’పై కొణిదెల నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ మల్టీస్టారర్ మూవీల్లో నటించిన సంగీత్ శోభన్ ఈ చిత్రంతో సోలోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మానస శర్మ తెరకెక్కించే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ బిల్లుకు మెజార్టీ వర్గాల మద్దతు ఉందని, ఇది తాము చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో షా పేర్కొన్నారు.

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలతో భారత్‌లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుండగా వీటిపై ట్రంప్ 13.3% సుంకం విధించనున్నారు. దీని ప్రభావంతో భారత్‌లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం పెరగడంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

AP: వెలగపూడి సచివాలయంలో CM చంద్రబాబును జనసేన MLC నాగబాబు భార్యతో సహా కలిశారు. MLCగా ప్రమాణ స్వీకారం అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువా కప్పి సీఎం సత్కరించారు. సీఎం, డిప్యూటీ సీఎం తనకు అవకాశం కల్పించి, అప్పజెప్పిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.