news

News April 2, 2025

అంజలి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

image

AP: AGM వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని అంజలికి అండగా ఉంటామని YS జగన్ వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని ఇవాళ తనను కలిసిన ఆమె కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధితురాలి పేరెంట్స్ కోరారు. పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

News April 2, 2025

మాజీ సీఎం లాలూకు అస్వస్థత

image

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీకి వెళ్లేందుకు పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. 4.05pmకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ఆర్జేడీ చీఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా, ఎయిర్ అంబులెన్సులో లాలూను ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లనున్నారు.

News April 2, 2025

BREAKING: మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

వరుస భూకంపాలు మయన్మార్ ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మయన్మార్‌లో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. 4.15pmకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల 28న సంభవించిన భారీ భూకంపానికి ఇప్పటివరకూ 2,700 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.

News April 2, 2025

ధోనీ ఔట్‌పై రియాక్షన్ వైరల్.. ఫ్యాన్ గర్ల్ ఏమన్నారంటే?

image

IPL: RR vs CSK మ్యాచ్‌లో ధోనీ ఔటైన సమయంలో ఓ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఆమె పేరు ఆర్యప్రియా భుయాన్. గువాహటికి చెందిన ఈ 19 ఏళ్ల యువతి ఆ రియాక్షన్‌పై తాజాగా స్పందించారు. ‘CSKకు సపోర్ట్ చేసేందుకు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెళ్లాను. ధోనీ ఔటవడంతో అనుకోకుండా అలా రియాక్ట్ అయ్యాను. టీవీలో కనిపించిన విషయం నాకు తెలియదు. తర్వాత ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది’ అని పేర్కొన్నారు.

News April 2, 2025

ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

image

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.

News April 2, 2025

ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.

News April 2, 2025

ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు

image

TG: ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 2, 2025

STOCK MARKET: రాణించిన సూచీలు

image

మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రంప్ సుంకాల భయాలున్నా వాటి ప్రభావం స్టాక్స్‌పై పెద్దగా కనిపించలేదు. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర లాభపడి 76,146 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 23,300 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, జొమాటో, ఇండస్ ఇండ్, టైటాన్ షేర్లు రాణించాయి. కాగా.. ఈరోజు రాత్రి 1.30 గంటలకు సుంకాలపై ట్రంప్ నిర్ణయం వెలువడనుంది.

News April 2, 2025

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: అనిత

image

AP: విశాఖలో ప్రేమోన్మాది దాడి <<15968879>>ఘటనపై <<>>హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. యువతి తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 2, 2025

HCU భూములపై విచారణ రేపటికి వాయిదా

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్లు కొట్టేయొద్దని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా HCU భూముల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వారం నుంచి జేసీబీలు, పొక్లెయిన్లతో అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించి చదును చేయిస్తోంది.