news

News April 2, 2025

స్టూడెంట్ తండ్రికి టీచర్ ముద్దులు.. చివరకు..

image

బెంగళూరులో శ్రీదేవి అనే ప్రీ స్కూల్ టీచర్ ఓ విద్యార్థిని తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తొలుత అతడి వద్ద నుంచి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడిపింది. అతడికి ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియో చాట్‌లను బయటపెడతానంటూ విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో చివరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News April 2, 2025

శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

image

హైదరాబాద్‌లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

News April 2, 2025

పార్లమెంట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

image

లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. LOP రాహుల్ గాంధీ ఇప్పుడే పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా బిల్లు విషయంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. సరైన చర్చ లేకుండానే బిల్లు పాస్ చేయాలని చూస్తోందన్నారు. తమకు మాట్లాడేందుకు సరిపడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు కేంద్ర మంత్రి రిజిజు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.

News April 2, 2025

అది గుర్తొచ్చినప్పుడల్లా గూస్‌బంప్స్ వస్తాయి: యువీ

image

వన్డే వరల్డ్ కప్‌-2011ను టీమ్ఇండియా గెలుపొందడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘APR 2, 2011. ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడాం. అలాగే రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌ను తన భుజాలపై మోసిన లెజెండ్ సచిన్‌కు ఈ విజయం అంకితం చేశాం. ఇన్నేళ్లయినా ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ వస్తాయి. ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేం’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

News April 2, 2025

వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

image

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.

News April 2, 2025

IPLలో ప్లేయర్ మ్యాచ్ ఫీజ్ ఎంతంటే?

image

LSG బౌలర్ <<15965200>>దిగ్వేశ్<<>> సెలబ్రేషన్‌ను తీవ్రంగా పరిగణించిన BCCI మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. కాగా, IPLలో ఓ మ్యాచ్ ఆడితే BCCI ప్లేయర్‌(ఇంపాక్ట్ ప్లేయర్)కు రూ.7.5లక్షలు చెల్లిస్తుంది. లీగ్ స్టేజ్‌లో మొత్తం 14మ్యాచులు ఆడితే రూ.1.05cr దక్కుతాయి. ఇది ఫ్రాంచైజీ ప్లేయర్‌కు చెల్లించే వేలం ధరకు అదనం. ఇందుకోసం ప్రతి జట్టు BCCIకి రూ.12.60cr చెల్లిస్తుంది. ఈ లెక్కన దిగ్వేశ్‌ రూ.1,87,500 నష్టపోనున్నారు.

News April 2, 2025

యూపీఏ హయాంలోనూ సవరణలు జరిగాయి: రిజిజు

image

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.

News April 2, 2025

NZలో వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్

image

పాక్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌లో జరిగిన చివరి 12 వన్డేల్లో పాక్‌ మట్టికరిచింది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన NZ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు T20 సిరీస్‌ను 4-1తో గెలిచింది. స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకున్నా కివీస్ అదరగొట్టింది. NZ-B టీమ్‌‌ ముందు కూడా పాక్ చతికిలపడిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

News April 2, 2025

2019లోనూ నలుగురు MLAలను గెలిపించారు: లోకేశ్

image

AP: ప్రకాశం జిల్లా అంటే ప్రేమ, పౌరుషం గుర్తొస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2019లో TDPకి రాష్ట్రంలో ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. TDP, చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశంలో ఓ ప్రభంజనంలా నడిచిందని, అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు.

News April 2, 2025

స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు జోక్యం చేసుకోవాలి: రోహత్గి

image

TG: ఫిరాయింపు MLAల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశమని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్‌కు చెప్పలేమా అని జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు.