news

News April 2, 2025

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ

image

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.

News April 2, 2025

నేను ఎవరితోనూ డేట్ చేయలేదు: హీరోయిన్

image

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ దివ్య భారతి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాను ఏ నటుడితో గానీ పెళ్లైన వ్యక్తులతో గానీ డేట్ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దివ్య భారతి, జీవీ కలిసి బ్యాచిలర్, కింగ్‌స్టన్ మూవీలో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

News April 2, 2025

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్స్

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.

News April 2, 2025

విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు?

image

HYDలో అత్యాచారానికి గురైన జర్మనీ యువతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో అందమైన లొకేషన్లు ఉంటాయంటూ ఆ యువతిని నమ్మించి పాతబస్తీకి చెందిన మహ్మద్ అస్లాం (25) పహాడీ షరీఫ్ తీసుకెళ్లాడు. ఆమెతో వచ్చిన ఫ్రెండ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ యువతిపై దారుణం జరుగుతున్నా అతడు స్పందించలేదని సమాచారం. ఆ యువతి జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News April 2, 2025

రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

image

TG: బీసీల రిజర్వేషన్లు 42% పెంపుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, MLAలు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపగా పార్లమెంటులోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, AICC నేతలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొననున్నారు.

News April 2, 2025

గాంధీ ముని మనవరాలు కన్నుమూత

image

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.

News April 2, 2025

దేశానికి ఇవాళ బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల

image

AP: మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని YS షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ బ్లాక్ డే అని తెలిపారు. వక్ఫ్ బిల్లును దేశంలోని 20కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు TDP, జనసేన మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు.

News April 2, 2025

నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

image

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.

News April 2, 2025

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

image

TG: రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సరుకుల కిట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుందని సమాచారం. గతంలో ‘అమ్మహస్తం’ పేరుతో కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, కారంపొడి, పసుపు, కిరోసిన్ అందజేసింది.

News April 2, 2025

14వేల ఎకరాల భూమి ఉన్నా ఈ వినాశనం ఎందుకు?: కేటీఆర్

image

TG: ఫ్యూచర్ సిటీకి భూమి అందుబాటులో ఉన్నా విలువైన పర్యావరణాన్ని వినాశనం చేయడం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ Xలో ప్రశ్నించారు. ‘ఫ్యూచర్ సిటీ’లో ఐటీ పార్కులు, ఆర్థిక కార్యకలాపాల కోసం 14వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రస్తుత నగరాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని హాష్‌ట్యా‌గ్‌ ఇచ్చారు.